|
|
Articles: Short Stories | ఆన్ లైన్ పెళ్లి - Editor
| |
మాలిని ఎన్నో పూజలు, పునస్కారాలూ చేసింది. తీర్థయాత్రలు చేసింది. ఆఖరికి కోరిన కోరికలల్లా నేర్చవేర్చగలరనే నమ్మకం కుదిరిన ఓ గురువుగారు కూడా దొరికారు. ఇద్దరమ్మాయిల తర్వాత కొడుకు కావాలంది. కలిగేడు. వాడికి మంచి చదువు, అమెరికాలో ఉద్యోగం, అంతు తెలియని సంపద అన్నీ కోరుకున్నట్టే జరిగాయి. ఇప్పుడు ముద్దుల కొడుకు బుజ్జిగాడి పెళ్లి ఎలా జరగనుందో మరి.
అమెరికా వెళ్లిన అబ్బాయిల పెళ్లిళ్లు చూసి నేను వాటికి 'తత్కాల్ వివాహం' అని పేరు పెట్టేను. అనుకోకుండా ప్రయాణం చేయవలసినప్పుడు 'తత్కాల్ రిజర్వేషన్' అని రైల్వేవారు సదుపాయం ఏర్పాటు చేశారు. కాస్త ఖర్చు ఎక్కువకాని ప్రయాణానికి సాధారణంగా ఢోకా ఉండదు.
మధ్యాహ్నం విమానం దిగి సాయంత్రం పెళ్లి కూతురుని చూసి రాత్రికి ఏ గుడిలోనో పెళ్లి చేసుకొని మర్నాడు పెళ్లికూతురుతో వినీలాకాశంలో తేలిపోయి, అమెరికాలో దిగకముందే ఇటైతే మద్రాస్ లోనో అటైతే బొంబాయి లోనో శోభనం జరిపేసుకొనే శుభ వివాహాన్ని 'తత్కాల్ వివాహం' అంటుంటాను నేను. అయితే ఈ మధ్య తత్కాల్ వివాహాలకి ఆడపిల్ల తల్లి దండ్రులంతగా ఇష్టపడడం లేదని తెలుస్తోంది. తత్కాల్ వివాహాలు కాస్తా తాత్కాలిక వివాహాలు అవుతుండడమే కారణం.
బుజ్జి పెళ్లి ఎవరితో జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అని నేను ఆలోచించేలోపే ఆదివారం వచ్చేసింది. అయినప్పటికీ వివాహ వివరాలు తెలియరాలేదు. నాకంటే ఎక్కువ ఆతృత పడుతున్న జానకి రెండు మూడు సార్లు ఫోన్ చేసినా మాలిని ముద్దుల మనుమరాలు అమెరికన్ యాసలో ఇంగ్లీషులో ముందుగా రికార్డ్ చేసిన మాటలు 'మీరు పిలిచినవారు ప్రస్తుతం అందుబాటులో లేరని చెప్పడానికి చింతిస్తున్నాం. దయచేసి కొంతసేపాగి మరలా ప్రయత్నించండి. లేదా మీ సందేశం 'బీప్' శబ్దం ఆగిన తర్వాత తెలపండి' అంటూ వినిపించేది. మా ఆవిడ ఆతృతకి అదొక పెద్ద బ్రేక్ కావడంతో విసుగుపుట్టి మరలా ఫోన్ చేయడం మానేసింది.
సాయంత్రం ఏడు గంటలయ్యేసరికి ముకుందం ఇల్లు చేరాం. ఉద్యోగంలో ముకుందం బాగానే సంపాదించేడు. అందరూ మాత్రం అదృష్టమంతా మాలినిదేనంటారు. అమెరికా నుంచి అబ్బాయి పంపిస్తున్న డబ్బు దానికి తోడయింది. వాళ్లు కొన్న తోటలు, భూములు, ఇల్ల స్థలాలు కాకుండా పట్నంలో ఈ ఇల్లు కూడా బాగానే కట్టించేడు. పెద్ద హాలు, అందులోంచి మేడ మీదకు మెట్లు, పైన మూడు గదులు, బాల్కనీలు, ఆ పైన మరో సింగిల్ బెడ్ రూమ్, దిగువ హాలుకు అటుపక్క, ఇటుపక్క పెద్ద పెద్ద గదులు, పెరటిలోను, విధిలోనూ పూల మొక్కలు, వీధిలోని ఫౌంటెన్, పెరటిలో స్విమ్మింగ్ ఫూల్, సర్వంట్ క్వార్టర్స్ ఉన్నాయి. మంచి అభిరుచి, సంపద గల వాళ్ల ఇల్లులా ఉంటుంది. గదుల్లో కూడా ఖరీదైన ఫర్నిచర్, షోకేసులలో అమెరికన్ బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, హోమ్ ధియేటర్, దిగువ నొకటి, పై గదుల బాల్కనీలో ఒకటీ కంప్యూటర్ సిస్టమ్స్, రకరకాల టెలిఫోన్లు శోభాయమానంగా ఉంది ఇల్లు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|