|
|
Articles: Short Stories | మానవతకే మచ్చు తునక - Editor
| |
నేను తెల్లమొహం వెయ్యడం చూసి - 'ఈ వయసులో కూడా ఇంకా నీ తల మీద పట్టెడు జుత్తూ, క్రాఫింగూ చూసి బట్టతలగల నేను అసూయపడడం సహజమే. కాని ఇప్పుడనిపిస్తోంది. తలకాయపైన ఏమున్నా ఒకటే అనీ, లోపల ఆలోచించే సరుకంటూ ఉంటే చాలుననీ!' అని దెబ్బ కొట్టేడు!
'లేకపోతే ఏమిట్రా బడుద్దాయ్! మన సీనియర్ 'సిటి'జనులు గడి గడియకీ వెదుక్కునే సీక్రెట్ ప్లేస్ ఏది? యీరినల్ కాదూ?'
మరి ఆమాట ఎక్కణ్ణుంచి విన్నాడో రాజారాం వస్తూ జవాబు చెప్పేడు - 'నువ్వు చెప్పింది పూర్తిగా కొట్టి పారెయ్యలేను గాని ఈ సారి వెళ్ళింది అందుకు మాత్రం కాదు'.
'ఎందుకో చెప్పి తీరాలి, అంతే, అందాకా ముక్కలు పంచను' అన్నాడు శంకరం.
'ఇందాక చూశారుగా మా ఆవిడ రాజ్యం హెల్త్ బొత్తిగా డెలికేట్. రెండేళ్ళ కిందట యూట్రెస్ రిమూవల్ ఆపరేషన్ అయిందగ్గిర్నుంచీ మరీ పాడైపోయింది. తను పోతాననే బాధ కంటే తను పోయాక నన్నెవరు చూసుకుంటారనే బెంగ ఒకటే. ఎన్ని చెప్పినా వినదు. బీపీ ఒకటి పట్టుకుంది కదా, ఆరారా గ్లూకోజో, హార్లిక్సో, పళ్ళరసమో ఏదో ఒకటి పడుతూండాలి. వేసుకోవలసిన టాబ్లెట్సు సరేసరి. నేను నా చేత్తో యిస్తే గాని ఆ నోరు తెరుచుకోదు. నేను నా చేత్తో భుజం మీద తడితే గాని ఆ గుండెకి ధైర్యం చిక్కదు. ఈ కనిపిస్తున్న గదులూ, ఈ ఆధునిక పరికరాలూ, ఇంత పెద్ద సంఖ్యలో ఈ నౌకర్లూ ఇవేవీ ఇవ్వలేని సాన్నిహిత్యం మేం ఇద్దరం ఒకరి సమక్షమంలో ఒకరం పొందుతున్నాం!'
తనది కాని అతి నెమ్మదైన స్వరంతో రాజారాం యిలా చెప్పుకుపోతూంటే ఎప్పుడూ ఎరగని వ్యక్తి నుంచి ఏవో కొత్త ముక్కలు విన్నట్టు మేమిద్దరం నిశ్చేష్టులమయిపోయాం. అదే స్వరంతో నా చేయి పట్టుకొని కొనసాగించాడు. - 'నువ్వు ఎంతో ప్రేమతో ఫోన్లో రమ్మన్నావు. అప్పుడు మా రాజ్యం పక్కనే వుంది. 'ఈ మధ్య బొత్తిగా నాతోనే మీ లోకమై పోయింది. తప్పకుండా పెళ్ళికి వెళ్ళిరండి. స్నేహం అనేది గొప్ప ఔషధం. సేవించిరండి. నేనేం అయిపోను' అని పైకి చెప్పింది కాని దాని కళ్ళల్లో మా మనవరాలు పాపాయి కనిపించింది. నన్నొదిలి నిముషం ఉండేది కాదు. మూడేళ్ళొచ్చాయో లేదో, చలిదేశంలో పుట్టి పెరిగిందేమో, ఎత్తుకుంటే ముచ్చెమటలు పోసేవి! అలాంటిదెప్పుడూ నా మీద స్వారీ చేస్తూ ఉండేది. వీపుమీదో, పొట్టమీదో, జూచిన కాళ్ళమీదో, చంకలోనో... ఆ ప్రేమ తాకిడికి గుండె గుబగుబలాడిపోయినా అలా ఆగిపోతే అంతకంటే అదృష్టమేముంది! అనిపించేది!'
మరో రౌండు టీ మే ముగ్గురం సేవించాక రాజారాం కొనసాగించాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|