TeluguPeople
  are the trend-setters

 
Articles: Literature
అన్ని భాషల తల్లి?
- Mr. vamsymohan vamsymohan
< < Previous   Page: 3 of 3    
అందులో పాండిత్యం సంపాదించిన పండితులు, అనుకోకుండా తమ సొంత భాషలోనూ ఆ పదాలను జోడించి రచనలు చేశారు. ఆ భాష అలవాటైపోబట్టి వదులుకోలేడు. ఇప్పుడు తెలంగాణా ప్రాంతీయులకు ముస్లిమ్ ఉర్దూ పదాలు తగులుకున్నట్టు తగులుకున్నాయి ఈ సంస్కృత పదాలు. ఇకపోతే, వివిధ భాషల వారూ, విడిపోకుండా ఉండేటందుకు - భిన్నత్వంలో ఏకత్వం రప్పించేందుకు అందరిదీ ఒకే దైవం అయినందున ఈ సంస్కృత పదాలని జోడించి రాశారు. అలా ఎందుకు చేశారంటే, ఎవరు ఏ భాషలో మాటాడుకుంటున్నా ఈ సంస్కృత పదాలు తగిలితే, ఆ సంస్కృతం పూరాగా తెలీకున్నా మొత్తం చెప్పేది అర్థమవుతుంది. ఆ విధంగా సంస్కృతానికి ప్రాముఖ్యత ఇచ్చారు. నేటి భారతీయులు హిందీని నేషనల్ లాంగ్వేజి అని అందరూ నేర్చుకోవాలని అన్నారు. దానికి తమిళులు హిందీ మా నెత్తిన రుద్దరాదని పెద్ద పేచీ పెట్టి సమ్మెలు చేసి హిందీని దూరంగా పేరుకే ఉంచారు గానీ, వారందరికీ హిందీ వచ్చు. Hindi is the National language of India. But once upon a time Sanskrit is the National language of India to learn different subjects during their education time. Now English is the world wide known language to learn things. Ofcourse there is another language known to the world. But, It is not known to Indians. Thus, English is the father and necessary language to be known to every body to tour world wide and get education of different country's culture and subjects of science. Hence, English is the in - evitable evil now a days. Because of this reason now a days parents in India are insisting their children to study in English medium schools and convents. In Future world may say that the English is the Father of all languages. ఇప్పుడు ఆంగ్లేయులు (సూర్యుడస్తమించని రాజ్యం వారు) తమకి విభిన్న భాషలని అర్థం చేసుకోవటం ఇబ్బందై, తమ ఆంగ్ల భాషని విద్యా బోధనకి వాడి, మన వారినందరినీ (పెద్ద చదువులు చదివిన వారిని ఆంగ్ల పండితుల్ని చేశారు.) అందువల్ల ఆసేతు హిమాచలం అన్ని భాషా పదజాలాల్లోనూ ఈ ఆంగ్లపీచు పడి, ఆ పీచుని పీక్కోలేకా లాక్కోలేకా ఛస్తున్నాం. ఆంగ్లేయులు కూడా తమ భాషలోనికి మిగిలిన దేశ భాషా పదాలను దిగుమతి చేసుకుని తమకి ఇబ్బంది లేకుండా తేలిగ్గా మన మాటలు కొన్నైనా తెలుసుకున్నారు. మన భాషలని మన సంస్కృతి తెలుసుకుందుకు వారు ఔపోసన పడితే, మనం వారి భాషను ఉపాధి కోసం అనేక ఇతర కారణాల వల్లా ఔపోసన పట్టాం. ఇప్పుడు మరో లక్ష - లక్ష దాకా ఎందుకూ మరో కొన్ని వేల సంవత్సరాలైతే, మన భావి తరాల వారు, ఆంగ్లం అన్ని భాషలకీ మూలమనీ, ఆంగ్లం ప్రపంచ భాషలకు తల్లి అంటారు. అందువల్ల నిజానికి, ఏ భాషకూ ఏదీ తల్లి కాదు. వేటికవే నాటి కాల మాన పరిస్థితులని బట్టి, శత్రుత్వ మిత్రత్వాలను బట్టి పుట్టి అవసరం మేరకు అభివృద్ధి చెందాయి. ఇప్పటికీ లిపి లేని గోండులు, కోయల భాషలున్నాయి. దానికి రేపు ఆంగ్లాన్ని ఎవడో లిపిగా వాడితే, నిజంగానే ఆంగ్లంలోంచే అన్ని భాషలూ పుట్టాయంటారు ఈ భాష జ్ఞాన పరిశోథకులు. Hats off to the research of these intellectual professors and readers of linguistics!

Be first to comment on this Article!

< < Previous   Page: 3 of 3    



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.