|
|
Articles: Short Stories | పుష్పక విమానము - Miss rajeswari rajeswarinedunuri
| |
మరికొన్ని చోట్ల అందమైన కొలనులు, పక్షులు సర్పాలు, వంటి వెన్నో వివిధ రకముల మణి మాణిక్యాలతో రూపు దిద్దుకొని ఉన్నాయి. జీవకళ ఉట్టి పడుతున్న కొన్ని బొమ్మల్లొ మేలు జాతి గుఱ్రాలు మంచి రెక్కలుగల పక్షులు, వాటి రెక్కలు ముఖాలు, ఎంతో విలాస వంతమైన భంగిమలో మలచటమె గాక వాటి రెక్కల మీద పగడాల పువ్వులు, బంగారు పువ్వులు పొదగబడి ఉన్నాయి. అంతే గాకుండా లక్ష్మీ దేవి తన మనోహర మైన హస్తాలలో పద్మాలను ధరించి పద్మ సరస్సులో విరాజిల్లు తున్నట్టు, ఆమె కిరువైపులా రెండు ఐరావతములు తమ తొండములతో పద్మాలను అభిషేకిస్తున్నట్టు మనోహరముగా చిత్రీకరించ బడి ఉంది. ఆ ఏనుగుల శరీరాలపై పద్మ కేసరాలు పడి ఉన్నట్లు, స్పష్టం గా కనబడుతున్న ఆ చిత్రాలను చూసి హనుమకు ఎంతో ఆశ్చర్యము ఆనందము కలిగాయట.
హంసలు, తుమ్మెదలు, నిద్రించుట చేత నిశ్శబ్ధము గా నున్న సరోవరము వలె నిద్రించు స్త్రీలతో ఆ శాల నిశ్శబ్ధముగా నున్నది. ఆ స్త్రీల ముఖములు సూర్యోదయముతో వికసించి, రాత్రి కాగానే ముకుళించిన పద్మమువలె నుండెను. కొంత పుణ్యము మిగిలియుండుట చేత ఆకాశమునుండి రాలిన తారలే ఈ రూపమున ఈ భవనమందు, స్త్రీలుగా ఉన్నారేమొ అన్న భ్రాంతి కలుగు చుండెను.
కేవలం ఆసనములే గాక సాక్షాత్తు స్వర్గములో ఉన్నట్టు, విశాలమైన వేదికలు, భవనములు, కొలనులు ఉద్యాన వనములు, వాటితో పాటు శ్రేష్ట తమములైన శంఖు, ఆయుధ, ధనుశ్శాలలు, మనోహరమైన విశాల మైన చంద్ర శాలలు, ఆపుష్పకములో ఇమిడి ఉన్నాయి. అంటే ఈ వర్ణనలను బట్టి చూస్తే దాని దివ్యత్వముతో పాటు ఆ నాటి శిల్ప చిత్రకళా విశిష్టతను తెలియ జెపుతున్నాయి. మరి నేటి విమానాలు వాటికి సాటి రాగలవా? ? ?
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|