|
|
Articles: Short Stories | సాగరయానం - Miss rajeswari rajeswarinedunuri
| |
అమెరికా నుంచి కెనడాకి షిప్పులో వెళ్ళాలని చేసిన ప్రయత్నం... గురువారం ఉదయం పది గంటలకి న్యూజెర్సీ నుంచి అందరం బయలు దేరి ఆగుతూ ఆగుతూ, తింటూ తాగుతూ, న్యూయార్క్ షిప్ యార్డ్ జేరే సరికి పన్నెండు దాటింది. కారు పార్కింగు చేసి సామాను అప్పజెప్పే చోట వారికి అప్పజెప్పి, చెకింగులు అన్నీ దాటుకుని, ఎయిరో బ్రిడ్జి లాగే ఉన్న షిప్పో బ్రిడ్జి (అదే పీర్) అంతా నడిచి షిప్పు లోకి అడుగిడ గానే 'ఇదేదో ఇంద్ర భవనమా? పుష్పక విమానమా?' అన్న భ్రాంతి కలిగింది. 'నిజానికి ఇంద్ర భవనం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పుష్పక విమానం గురించి పురాణాల్లో చదవటమే తప్ప చూసిందెవరని? ఐనా చదివిందానికీ సినిమాల్లో చూసిం దానికీ తేడా ఎంతో తెలియదు గానీ ఇది మాత్రం భూతల స్వర్గమే' అన్న భ్రాంతి కలిగింది.
అడుగడుక్కి, మెట్టు మెట్టూకీ రైలింగుకీ దీపాల తోరణాలు. పైన సీలింగుకి అజంతా చిత్రాలను మించిన అందమైన డిజైన్ లతో, దీప కాంతులతో కన్నుల విందుగా ఉంది. ఒక వైపు రంగు రంగుల అద్దాల్తో మిరు మిట్లు గొలుపుతూ పైకీ క్రిందకీ తిరుగుతున్న ఎలివేటర్ల సోయగాలు. ఇంకొక వైపు వీనుల విందుగా వాద్య సంగీతాలు.అందుకు లయ బద్ధంగా ఆడుతూ పాడుతూ ఎవరి ధోరణి లో వారు కదలి పోతున్నారు. తెలుపూ, నలుపూ, పొట్టీ, పొడుగూ లావూ సన్నం ఇలా. సరే అన్నీ చూసుకుంటూ రెండవ అంతస్తులో రూముకు వెళ్ళే సరికి మాకంటె ముందుగానే మా సూట్కేసులు గుమ్మంలో ఎదురు చూస్తున్నాయి. తాళం తీసి లోపలికి వెడితే ఏముంది? స్టార్ హోటల్ని మించి రాజ భోగాలతో స్వాగతం పలికింది. ఒక వైపు గోడకి అందమైన పెయింటింగులు, మరొక వైపు గోడంతా అద్దానికి క్రిందగా అమర్చిన టేబుల్ దానిమీద ఒక ట్రేలో రక రకాల పానీయాలు, మరొక వైపు ట్రేలో సువాసనల పెర్ఫ్యూములు. ఇంకొక వైపు కర్టెన్ తొలగిస్తే విండో గుండా బయటి ప్రకృతి అందాలు, తెల్లని దుప్పట్ల తో నీటుగా ఉన్న బెడ్లు, టి.వి, టెలిఫోను. ఇలా దేనికీ లోటు లేనంతగా దీని ముందు ఎంత పెద్ద హోటలైన దిగ దుడుపే అనిపించింది.
సరే ఇక అందరం తయారై తొమ్మిదో అంతస్తుకి వెళ్ళాము. అక్కడ లంచ్ అంటే బఫె సిస్టం. రక రకాల ఆహార పదార్ధాలు, పీజాలు, బర్గర్లు, డోనట్లు సలాడ్లు, టీ కాఫీలు, జ్యూసులు పేరు తెలియని ఎన్నో ఎన్నెన్నో. అంతస్తు మొత్తం, తిను బండారాలే. ఎవరికి కావలసినవి వారు తీసుకుని కూర్చుని తినడానికి అనువుగా అక్కడో షిప్పు అంచులకి బయటి వ్యూ కనబడేలా టేబుల్స్ వాటి చుట్టూ కుర్చీలు వేసి ఉన్నాయి. ప్రతి టేబుల్ కీ మధ్య గా షిప్పు రూఫు వరకు నలు వైపులా కనబడేలా నాలుగు నాగ కన్యల బొమ్మలు లైట్ల కాంతులు విరజిమ్ముతూ అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఏ అంతస్తులో ఎటువైపు చూసినా షిప్పుని ఇంత గొప్పగా ఎలా చేయ గలిగారా? అని విస్తు పోక తప్పదు. కావలసింది తిని తాగి ఫోటోలు తీసుకుంటూ పదవ అంతస్తుకి జేరుకున్నాం. అప్పడికి మూడు గంటలు దాటింది. అక్కడ అంతా స్విమ్మింగు పూల్ అవీ ఉన్నాయి.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|