|
|
Articles: Short Stories | తెలుగు పెర - Site Administrator
| |
ఎప్పుడొచ్చావ్? అమెరికాలోనేగా ఉండటం? సూదివేస్తే విన్పించేంత నిశ్శబ్దంగా ఉంది కదూ? ఇదొక కార్పొరేట్ కాసారం. దీన్లో రెండు, మూడు పెద్ద తిమింగలాలు విరామం లేకుండా తిరుగుతుంటై. లోపల చదువుకుంటున్న పిల్లల బుర్రల్ని శబ్దం విన్పించకుండా 'ఫట్ ఫట్'మని తినేస్తాయి. నెత్తురుగా, గాయాలుగా కన్పించవు. కాని విరిగిన ప్రతి అవయవం దేశీయంగా ఉండలేదు, బతకలేదు. ఈ తెలుగు పంతులేందా ఇంగ్లీషు సొంగకారుస్తున్నాడనుకుంటున్నావ్ కదూ? వెరీ సింపుల్. ఇక్కడ అప్పుడప్పుడు జారిపడే ఎంగిలి మింగి ఇట్టా ఐపోయాను. యామై కరెకట్? అని పకపకనవ్వుతూ, దూరంగా వస్తున్న వాడ్ని చూచి - ఏవో ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. చూచే ఏ దృశ్యాన్నయినా దుష్టాకారం చేసి, మేడంగారికి వర్ణించి చెప్తాడు. వస్తా! అని పక్క గదిలోకి జారుకున్నాడు.
పాపం జాలేసింది. తెలుగు పండితునిగా రిటైరై కూడా, ఇంకా మిగిలిన ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం అవస్థ పడ్తున్నట్లుంది. ఎదురు పడిన ఏవో 'మైనేం ఈజ్ ఎవిరావ్. ఏవో ఆప్ దిస్ ఇన్ స్టిట్యూషన్, మే, ఐనో యువర్ గుడ్ నేం?' అన్నాడు. అంత పొగుడూ కాదు, అంత పొట్టీ కాదు. యాభై ఏళ్ళు. మధ్యస్తంగా ఉన్నాడు. ఇన్ షర్ట్, ఖరీదైన షూస్, స్పెట్స్, చేతిలో చిన్నకర్ర. అచ్చం దొంగకోళ్ళు పట్టేవాడులా కన్పించాడు.
'ఐ యాం సతీష్, ఆటోమొబైల్ ఇంజనీర్. కమింగ్ ఫ్రం డెట్రాయిట్!' అన్నాడు.
'ఓ గ్రాండ్ సన్ ఆఫ్ రామసుబ్బయ్య?' మీరు విజిటర్స రూమ్ లోనే ఉంటే బాగుండేదేమో!
'మీలాంటి పెద్దలెవరూ కన్పించలేదు. ఇప్పుడైనా, విత్ యువర్ కైండ్ పర్మిషన్...?'
'వెళ్ళండి. అమెరికాలాగ మేం కూడా ఎవ్వెరి సెకండ్ వేస్ట్ చెయ్యం? వై షుడ్ వుయ్ డిస్టర్బ్ ది పీపుల్? ఏమంటారు? అమెరికాలో ఉంటున్నమీకు ఇదంతా చెప్పాలా? త్వరగా రండి. ట్రైటు అండర్ స్టాండ్ మీ సర్!'
'థ్యాంక్యూ సర్! మీ వేల్యుబుల్ డాలర్స్ టైం వేస్ట్ చేయను. జస్ట్ వనార్ టూ మినిట్స్'. అని తలొంచి విష్ చేసి పై మెట్లవైపు సాగాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|