|
|
Articles: TP Features | జ్ఞాన ప్రసార మాధ్యమం తెలుగు - Site Administrator
| |
ఇలా భాష సామర్ధ్యాన్ని వ్యక్తీకరణ వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే తమిళం మన దరిదాపులకు కూడా రాదనే విషయం స్పష్టమవుతుంది. తెలుగులోని అన్ని రకాల వ్యక్తీకరణాల్ని, ప్రదేశాలలో, కాలానుగుణంగా వచ్చిన మార్పుల్నీ దృష్టిలో ఉంచుకుంటే తమిళం లాంటి భాషలు మన భాషకు సరిపోలవు. ఇక ఇంగ్లీషు ఏ విధంగానూ సార్ధ్యంలో మన భాషతో పోటీ పడలేదు. భాష అన్నదే భావ వ్యక్తీకరణ కోసం ఏర్పడిందని ఎంత సూక్ష్మమైన విషయాన్నయినా వ్యక్తీకరించగల సామర్ధ్యం ఆ భాషకు ఉండాలని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా చూచినప్పుడు తెలుగు భాష తమిళం, ఇంగ్లీషు లాంటి భాషల కంటే ఎన్నో రెట్లు సామర్ధ్యం కలదని అర్థమవుతుంది.
తెలుగు సాహిత్యం ద్వారా జ్ఞాన ప్రసారం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఒక బృహత్తర ప్రణాళిక అవసరం. ఒక్కొక్క కావ్యంలో, కథలో, గేయంలో భాష ద్వారా ఎలా జ్ఞాన ప్రసారం జరిగిందో విస్తృత అధ్యయనం చేయాల్సి ఉంది. అదే ఒక ప్రత్యేకమైన వ్యాసం అవుతుంది.
మానవ సముదాయం జీవనం సాగించడానికి భాష చాలా అవసరం. సాహిత్యం ఒక్కటే కాక ప్రజల భాష నిత్య వ్యవహారాలలో ఎన్నో విధాలుగా వ్యక్తమవుతుంది. మూడు నాలుగు వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన తెలుగు భాషని చిందరవందర చేసి అన్ని వస్తువులలాగే దాన్నీ కల్తీ చేసి సర్వ నాశనం చేస్తున్న భాషా ద్రోహుల్ని క్షమించరాదు. వీళ్ళకి ఇటు తెలుగు రాదు, ఇంగ్లీషూ రాదు. సంకర భాషల్ని ప్రోత్సహిస్తున్న టివి చానల్స్ ని గర్హించాల్సి ఉంది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|