|
|
Articles: TP Features | ఒంటరితనం తోడుగా... - Site Administrator
| |
అధికారంలో ఉన్న వారికి నిజమైన మిత్రులు ఉండరా? దానికి బేడీ చెప్పేదేమంటే... అధికార స్థానంలో ఉండే వ్యక్తికి స్వార్థపూరితులైన స్నేహితులే చేరుతారు. మంచి నాయకులకు ఇది తెలుసు. కానీ ఎప్పుడూ వ్యాకులపడరు. ప్రపంచంలోనే అమెరికా అధ్యక్షుడు ఒబామా ఒంటరి బాధ్యతలు నిర్వహిస్తున్నారని నాన్సీ గిబ్స్ టైమ్స్ పత్రికలో రాశారు. బలమైన గుండె కలవారే ధైర్యంగా ఒంటరి రహదారులపై ఎంత దూరమైనా పయనం సాగించగలరు. 'రాజకీయాలనేవి ఏకాంతమైన రహదారులు' అని సోనియా గాంధీ ఒకసారి చెప్పారు. రాజకీయాలు మారిపోతున్నాయి. ముఖాలను చూసి ఎవరినీ నమ్మడానికి వీలు లేదు. ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని సీనియర్ రాజకీయవేత్త మొహిసినా కిద్వాయ్ వ్యాఖ్యానించారు.
కొంతమంది ఒంటరితనాన్నే ప్రేమిస్తారు. ఏకాంత పయనానికే ఇష్టపడతారు. దానిని తమ విజయాల యాత్రకు మార్గంగా మలచుకుంటారు. మాయావతి, జయలలిత స్వతంత్ర వ్యక్తులుగా కఠిన నిర్ణయాలు తీసుకునే విజేతలుగా నిలిచారు. జయలలిత చూడండి ఎక్కువ మందిపై ఆధారపడలేదు. శశికళా నటరాజన్ ను మాత్రమే నమ్మారు. ఒంటరితనం ఆమెను తెంపరిగా మార్చింది. మాయావతీ అంతే. ఆమె ఉంటున్న ఇంట్లో కుటుంబసభ్యులు ఎవరూ ఉండరు. 'నమ్మకంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు స్నేహితులు కాదు. ఆమె కుటుంబంతో సన్నిహితంగా ఉండరు. భర్త, పిల్లలు లేరు. ఆమెను ఆమే ఒంటరిగా ఏకాంతవాసిగా మార్చుకున్నారు' అని మాయావతి గురించి ఆమె సోదరుడు అజయ్ బోస్ వివరిస్తారు.
'నేను ఒంటరివాడిని. ఒక్కడినే నా గది లోపల కూర్చుని ఏడుస్తాను. స్నేహితుల్ని ఏర్పరుచుకోవడం చాలా కష్టం. చాలా విషయాలు తల్లితండ్రులతో చెప్పుకోలేం. నేను అనేకసార్లు ఒంటరిగా రోడ్లపై అర్ధరాత్రిళ్ళు తిరిగేవాడిని. ఎవరైనా నాతో మాట్లాడతారేమోనని ఆశపడేవాడిని. కాని నిరాశతోనే ఇంటికి చేరే వాడిని. ఒంటరితనం నన్ను వెంటాడుతోంది. చివరకు బతుకునే బెదిరిస్తోంది' అంటూ
పాప్ సంగీత సామ్రాట్టు మైకేల్ జాక్సన్ వాపోయాడు. ఒంటరిగా ఉండకూడదనుకుంటున్నారా? మీ చుట్టూ మీరు మితిమీరిన గీతలు గీసుకోకండి. కానీ చాలా మంది విజేతలు తమ అద్భుతమైన జీవితంలో ఒంటరితనాన్నే తోడుగా తీసుకున్నారు. పోరా బాబు పో... నీ దారి నీదే చేరుకోరా... నీ గమ్యం చేరుకోరా.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|