|
|
Articles: Devotion | మణిదీప వర్ణన - Site Administrator
| |
కంచుగోడల ప్రాకారాలు
రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు
మణిద్వీపానికి మహానిధులు
పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు
ఇంద్రనీలమణి ఆభరణాలు
వజ్రపుకోటలు వైడుర్యాలు
పుష్యరాగమణి ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు
సప్తకోటి ఘనమంత్రవిద్యలు
సర్వశుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
మిలమిలలాడే ముత్యపురాసులు
తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు
కుబేర ఇంద్ర వరుణ దేవులు
శుభాల నొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు
భక్తి జ్ఞాన వైరాగ్యసిద్ధులు
పంచభూతములు పంచశక్తులు
సప్త ఋషులు, నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు
కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిలమహాగృహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు ||భువనే||
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|