|
|
Articles: TP Features | రాజుల మాతృభాష ఏమిటి? - Site Administrator
| |
ఒక కథ ప్రకారం శాతవాహన రాజులకు సంస్కృతం తెలియదు. జలక్రీడలాడుతూ ఒక రాజు భార్య నీళ్ళతో కొట్టవద్దని 'మోదకైస్తాడయః' అంటే 'మ+ఉదక' అని విభజించలేని రాజు మోదకాలు (పిండివంటలు) తెప్పించాడట. కథ విషయం ఎలా ఉన్నా రాజు భార్య సంస్కృత పండితురాలు. ఆవిడ ఏ దేశానికి చెందిన ఆడపడుచో! ఈ రాజు ఏ దేశాన్ని జయించినప్పుడు పెళ్ళాడాడో! వీరి పిల్లలకు మాతృభాష ఏమిటో! మనమిప్పుడు ఎంత తలపగులగొట్టుకున్నా ఈ సమస్యను విప్పలేం.
చాళుక్యులు కన్నడ దేశం నుండి ఆంధ్ర దేశానికి వచ్చి పూర్వచాళుక్యులయ్యారు. వారి మాతృభాష కన్నడమే. వేములవాడ చాళుక్యులు కన్నడంలో శాసనాలు వేయించారు. అరికేసరి పంపమహాకవికి ఆశ్రయమిచ్చాడు. గుణగ విజయాదిత్యుడికి, ఇతర చాళుక్య రాజులకి 'గుణకెనల్ల' లాంటి కన్నడం బిరుదులుండేవి. అయితే పూర్వచాళుక్యులందరూ కన్నడం వాళ్ళని చెప్పడానికి లేదు. ఎందుకంటే స్థానిక రాజులు కూడా కొంత బలం సంపాదించాక చోళులని, చాళుక్యులని, ఇక్ష్వాకులని పేరు పెట్టుకున్నారు. చోళులు తామంతా కరికాళచోళుని వంశం వారమని చెప్పుకోవడం, చాళుక్యులు మొదట తాము సూర్యవంశజులమని తర్వాత చంద్రవంశజులమని చెప్పుకోవడం అన్నీ కల్పిత గాథలే. సూర్యవంశజులంతా అయోధ్యవైపు, చంద్రవంశజులంతా హస్తినవైపు తమ మూలాలను చూపిస్తారు. ఇవేవీ నమ్మదగినవి కావు.
అంతవరకెందుకు? రాజరాజ నరేంద్రుడు చాళుక్యుడు. అయితే కన్నడంవాడా అంటే అనుమానమే. అయితే ఆ కాలానికి రాజమహేంద్రవరంలోనూ కన్నడ పండితులుండేవారు. నన్నయే రాసిన నందంపూడి శాసనం ప్రకారం నారాయణభట్టు 'సంస్కృత కర్ణాట' భాషలలో కవిరాజశేఖరుడు. రాజరాజ నరేంద్రుడి కొడుకే వివాహ సంబంధం వల్ల భాష మార్పిడి చేసుకొని, పేరు కూడా మార్చుకొని కుళోత్తుంగ చోళుడయ్యాడు. ఇలాంటి వారిని ఏ భాషకు చెందినవారని చెప్పాలి?
శ్రీకృష్ణ దేవరాయల భార్యల మాతృభాష ఏమిటి? ఉత్కళంలో వివాహమాడిన కన్యల మాతృభాష ఏమిటి? రాయల వంశంలో ఎంతమంది తల్లుల మాతృభాష కన్నడం? ఎంతమందిది తెలుగు? ఎంతమందిది ఓఢ్రభాష? మైసూరు మహారాజా జైపూరు వెళ్ళి అక్కడి కన్యను వివాహం చేసుకొని వచ్చారు. మరి ఇప్పటి యువరాజు మాతృభాష ఏమిటి?
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|