|
|
Articles: TP Features | 'శ్రీకృష్ణ' ముందున్న సవాళ్లు - Site Administrator
| |
ఇక నాలుగవది - ఆంధ్ర ప్రాంతంలో పోటీగా ప్రారంభమైన ఉద్యమం మూలాలు తెలుగు మాట్లాడేవారందరూ సమైక్యంగా ఉండాలనే సిద్ధాంతంలో లేవు. కాకపోతే అలా ప్రచారం జరుగుతోంది. ఇది ప్రధానంగా హైదరాబాద్ నగరంపై హక్కులకు సంబంధించినది. ఈ నగరం తెలంగాణ ప్రజలు నిర్మించినది మాత్రమే కాకుండా వారి సాంస్కృతిక చరిత్ర, జ్ఞాపకాలలో అంతర్భాగం కూడా. తెలంగాణ ప్రాంతం నుంచి హైదరాబాద్ ను వేరు చేసేందుకు జరిగే ఏ ప్రయత్నమైనా వారి చరిత్రను వారికి కాకుండా చేయడమే అవుతుంది. ఇతర ప్రాంతాల నుంచి విశేషంగా పెట్టుబడులు పెట్టారనేది నిజమే. కాని హైదరాబాద్ లోను, పరిసరాలలోను ప్రభుత్వ భూములను గడచిన ఐదారేళ్ల కాలంలో బాధ్యతారహిత ప్రభుత్వం వేలం వేసినప్పుడు ఆ ప్రాంతాల వారు విపరీతంగా ఆ భూములను కొనుగోలు చేశారు.
తెలంగాణ ప్రజలు నిర్మించిన, ఇతర ప్రాంతాలకు చెందిన పెట్టుబడిదారులు కొనుగోళ్ళు జరిపిన హైదరాబాద్ నగరం భావి ప్రతిపత్తిని కమిటీ ఏవిధంగా నిర్ణయిస్తుంది? ఇది ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్ ఆక్రమణ మధ్య సంఘర్షణ. అయితే, హైదరాబాద్ లో ఇప్పటికే నివసిస్తున్న ఆంధ్ర ప్రాంతం వారితో సహా దేశంలోని వివిధ ప్రాంతాలవారు సాంస్కృతిక వారసత్వ సంపదకు, భిన్న సంస్కృతులకు ప్రతీక అయిన ఈ నగరం తమదేననే భావనతో సామాజిక సామరస్యంతో జీవనం సాగించేలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది.
పలు ఇతర అంశాలతో పాటు ఈ నాలుగు సవాళ్లు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ లో భాగంగా ఉన్నాయి. వీటిని పరిష్కరించకపోతే, మరే ప్రత్యామ్నాయ మార్గాలనూ తెలంగాణ ప్రాంతం వారు పరిగణనలోకి తీసుకోరు. ప్రత్యేక రాష్ట్రం కాకుండా తెలంగాణ ప్రాంతం వారిని సంతృప్తి పరచగల, ఆంధ్ర ప్రాంతంలో పోటీ ఉద్యమకారులకు కూడా ఆమోదయోగ్యం కాగల ఏ పరిష్కారాన్నైనా శ్రీకృష్ణ కమిటీ సూచించగలిగితే అది చరిత్రాత్మక ఘనత మాత్రమే కాకుండా మనిషి చాతుర్యానికి ప్రతీక కూడా కాగలదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|