TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Pushpa as Ammoru

President Droupadi Murmu got a ceremonial send-off

Colosseum, a design experience center in Hyderabad

TSA Qatar Womens Cricket Tournament

Telangana High Court Centenary
 
Articles: Time Pass
చెప్పు నీతి
- Site Administrator
< < Previous   Page: 2 of 3   Next > >  
`ఎవరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడ్డా వాణ్ణి చెప్పు తీసుక్కొట్టాలి. అలా కొట్టినవాడిమీద ఎటువంటి పోలీసు కేసూ ఉండదు. కొట్టించుకున్నవాడిమీద కూడా ఎటువంటి అవినీతి కేసూ ఉండదు. ఎంచేతనంటే, శిక్ష వెంటనే అనుభవిస్తాడు కాబట్టి. ఈ విధంగాచేస్తే కొన్నాళ్ళకి అవినీతి, లంచగొండితనం హుష్ కాకి!' ఈ ఆలోచన చట్టం రూపం దాల్చింది. అంతే, జనం ఎగబడి, లంచం అడిగినవాణ్ణి చెప్పుచ్చుకొట్టడం మొదలు పెట్టారు. ఫలితంగా ఎంతోమందికి పళ్ళూడిపోవడం, కళ్లు బైర్లుకమ్మడం, సొమ్మసిల్లిపోవడం ఎక్కువయింది. వైద్యులకు చేతినిండా పని ఏర్పడింది. వాడుతున్న చెప్పుతో కొట్టడం వల్ల గాయాలకు బాక్టీరియాతోడై, చాలా కేసుల్లో ప్రాణహాని జరుగుతోందని - ఇది అమానుషం అని - లంచం తీసుకున్న నేరానికి మరణశిక్ష విధించడంలాంటిదని - సభల్లో మళ్ళీ చర్చ మొదలయి చట్టానికి సవరణ జరిగిందిలా.... `కొట్టడానికి ప్రత్యేక చెప్పువాడాలి' `కాలికి ధరించినదై ఉండకూడదు'. జనం అలా మూడో చెప్పును సంచీలోనో, జేబులోనో పెట్టుకుని తిరగడం మొదలెట్టారు. మొత్తానికి లంచం అడగడం తగ్గింది. ప్రభుత్వం చాలా సంతోషించింది. కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం లేదు. `సార్! మీ కేసు చూడాలంటే, మీ కన్నా ముందు చాలా కేసులున్నాయి. కాబట్టి నాలుగేళ్ళు పట్టొచ్చు,' అనడం మొదలెట్టారు. అదేమిటయ్యా అనడిగితే `అవును సార్! ప్రతి కేసూ క్షుణ్ణంగా పరిశీలించకపోతే, ఆడిట్ వాళ్ళు నన్ను చెప్పుతో కొడతారు!' అంటున్నారు. `సరేలేవయ్యా! ఏదో కాస్త ముట్టచెబుతాలే!' అంటే, `బావుంది సార్! నేను లంచం అడిగితే, చెప్పుతో కొడతారా, మీరు లంచం ఇస్తానంటే మరి మిమ్మల్ని కొట్టొద్దా?' అంటున్నారు.

Be first to comment on this Article!

< < Previous   Page: 2 of 3   Next > >  



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training