యువతిపై ప్రేమోన్మాది దాడి
కాకినాడ: ప్రేమ పేరుతో సంవత్సరకాలంగా వేధిస్తున్న యువకుడు చివరకు దాడికి సిద్ధపడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా ఇంటర్ చదవుతున్న చిన్నారి అనే విద్యార్ధినిని, రవి బాబు అనే యువకుడు ప్రేమించమంటూ వేధింపులకు గురి చేయడంతో ఆమె తల్లిదండ్రులు చదువు మాన్పించివేశారు. ఐనా రవి బాబు ఆమె వెంటబడడం మానలేదు. చిన్నారి ప్రేమించకపోవడంతో ప్రేమోన్మాది వేడి నూనెతో ఆమెపై దాడి చేశాడు. ఈ సంఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News Posted: 5 March, 2009
|