నెల్లూరు : నెల్లూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాకు మినీ లారీలో తరలిస్తున్న పేలుడు పదార్థాలను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా నెల్లూరు జిల్లా సోమశిల వద్ద వాహనాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఈ పేలుడు పదార్ధాలు బయటపడ్డాయి. కాగా ఇవి ఎవరివనేవి ఇంకా తేలాల్సి ఉంది.