అనంతపురం : జిల్లాలో శుక్రవారం తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదు అయ్యింది. పూణె నుంచి అనంతపురానికి వచ్చిన నారాయణ అనే విద్యార్థి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళగా వైద్యులు అతనికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. దీంతో అనంతపురం జిల్లాలో తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది.