భగవద్గీతపై రాష్టస్థ్రాయి పోటీలు
రాజమండ్రి : అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ఆధర్యంలో రాష్ట్ర స్థాయి భగవద్గీత పోటీ లు డిసెంబర్ లో జరుగనున్నాయి. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఇస్కాన్ దక్షిణ భారత ప్రాంత ఇన్ఛార్జి, రాజమండ్రి సెంటర్ హెడ్ సత్య గోపీనాధ్ దాస్ తెలిపారు. ప్రతి జిల్లాలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. రాజమండ్రి లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కోస్తా జిల్లాల స్థాయిలో డిసెంబర్ 13న, తెలంగాణా ప్రాంతంలో 20న, రాయలసీమ ప్రాంత జిల్లాల్లో 27న పోటీలు జరుగుతాయన్నారు.
News Posted: 13 November, 2009
|