ఆరోగ్యశ్రీలో ఫస్ట్
కాకినాడ : రాజీవ్ ఆరోగ్య శ్రీ అమల్లో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్ధానంలో నిలిచిందని కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఈ పథకం ద్వారా జిల్లా ప్రజలకు విశేషమైన సేవలందించడం ద్వారా ఘనత సాధించినట్లు ఆయన చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2007 సంవత్సరం నుండి ఇప్పటివరకు జిల్లాలో 35,081 మంది నిరుపేదలకు రూ. 109.55 కోట్ల విలువైన శస్త్రచికిత్సలు చేశామన్నారు. ఈప్పటివరకు 774 వైద్య శిబిరాలు నిర్వహించి 34 శాతం గుండె ఆపరేషన్లు, 8 శాతం ప్రమాదాలు జరిగిన వారికి వైద్యసేవలు అందించామన్నారు.
News Posted: 4 January, 2010 Be first to comment on this News / Article!
|