కోనేరు ఆరోగ్యం విషమం
హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోనేరు రంగారావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయన్ను ఆదివారం ఉదయం జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. కొంతకాలంగా ఆయన న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నెల రోజుల క్రితం కూడా కోనేరు ఇదే సమస్యతో అసుపత్రిలో చేరి నాలుగు రోజల పాటు చికిత్స పొందారు.
News Posted: 7 March, 2010
|