విజయనిర్మలకు 'రఘుపతి'
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుకు గిన్నిస్ బుక్ రికార్డు దర్శకురాలు, ప్రసిద్ధ నటి విజయనిర్మల ఎంపికయ్యారు. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డుకు సీనియర్ నటి జమునను అవార్డుల ఎంపిక కమిటీ ప్రకటించింది. 2008వ సంవత్సరానికి గాను రాష్ట్రప్రభుత్వం అందజేసే జాతీయ చలనచిత్ర అవార్డులను గురువారం ప్రకటించింది. ఈ నెల 16 తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. కాగా, బిఎన్ రెడ్డి అవార్డుకు దర్శకుడు కె.బి. తిలక్ కు దక్కింది.
Be first to comment on this News / Article!
|