'దశాబ్ది మహిళ'గా సోనియా కోజికోడ్ : ఈ దశాబ్ది ఉత్తమ మహిళగా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఉపా చైర్ పర్సన్ సోనియా గాంధీ ఎంపికయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా మలయాళ దినపత్రిక 'మాతృభూమి'కి చెందిన ఆన్ లైన్ ఎడిషన్ నిర్వహించిన సర్వేలో సోనియాకు ఈ దశాబ్ది ఉత్తమ మహిళగా అత్యధిక శాతం ఓట్లు వచ్చాయి. సర్వేలో సోనియాగు మద్దతుగా 53 శాతం మంది ఓట్లు వేశారు. కాగా, కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో భూగర్భ జలాలను కొల్లగొడుతున్నదంటూ కోకోకోలా సంస్థపై యుద్ధం చేసిన మాయిలమ్మ 13 శాతం ఓట్లతో ద్వితీయ స్థానం పొందింది. ఆమె తరువాతి స్థానాలు వరుసగా వ్యోమగామి సునీతా విలియమ్స్, మణిపూర్ ఇనుప మహిళ ఇరోం షర్మిల, రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ దక్కించుకున్నారు. అయితే, సైనా నెహ్వాల్, ఐశ్వర్యారాయ్ బచ్చన, సానియా మీర్జాలకు కేవలం 4,3,2 శాతం ఓట్లే పడ్డాయి.
News Posted: 11 March, 2010
|