ఇది కేసీఆర్ కుట్ర : నాగం హైదరాబాద్: తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి(జెఎసి) నుంచి తెలుగుదేశం పార్టీ బహిష్కరణలో కోదండరామ్‌ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుట్రపన్నారని టీడీపీ సీనియర్ నేత నాగం జనార్థన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రసమితి అజెండాలో భాగంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు ఈ బహిష్కరణ చేశారన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు ఏకాభిప్రాయం కావాలని ప్రధాని అంటే నోరు మెదపలేని కేసీఆర్ , కోదండరామ్‌లు తమను విమర్శించటంలో అర్థంలేదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది టీఆర్‌ఎస్ జేఏసీ మాత్రమేనని ఆయన అన్నారు. తాము ప్రత్యేక పంథాలో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి ముందుకు తీసుకుని వెళతామని నాగం స్పష్టం చేశారు.
News Posted: 13 March, 2010
|