ముంబై: ముంబైలో శుక్రవారం జరిగిన ఐపిఎల్ ప్రారంభ మాచ్ లో స్లో ఓవర్ రేట్ కు బాధ్యుడిని చేస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఐపిఎల్ శనివారం జరిమానా విధించింది. డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైడర్స్ బౌలర్లు స్లో ఓవర్‌రేట్‌ను నమోదు చేశారు. దీనిపై కన్నెర్ర చేసిన ఐపీఎల్ 20వేల డాలర్ల జరిమానా కట్టాలని గంగూలీని ఆదేశించింది.