పైడిపర్రులో మావోల డంప్ ఏలూరు: ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో మావోయిస్టుల భారీ ఆయుధాగారం (డంప్) బయటపడింది. ఈ సంఘటనతో పోలీస్ నిఘా వర్గాలు ఖంగుతి న్నాయి. శనివారం తణుకు సమీపంలోని పైడిపర్రు గ్రామంలో గల ఒక ఇంటిలో భారీ ఎత్తున నిల్వ చేసిన పేలుడు పదార్ధాలు, రాకెట్ లాంఛర్ విడి భాగాలు, గ్రనే డ్స్ షెల్స్ వరంగల్ నుంచి వచ్చిన పోలీస్ స్పెషల్ పార్టీ జిల్లా పోలీసు సహకారంతో స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఇంటి యజమాని అందుబాటులో లేకపోవడంతో అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. శుక్రవారం వరంగల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు దక్షిణ తెలంగాణా కార్యదర్శి సోలిపేట కొండలరెడ్డి అలియాస్ టెక్ రమణ డైరీలో లభించిన సమాచారం ఆధారంగా పోలీసులు పైడిపర్రులో డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 4వేల రాకెట్ లాంఛర్ విడిభాగాలు (నట్లు, బోల్ట్‌లు వగైరా) పెద్ద ఎత్తున గ్రనేడ్‌షెల్స్, గంధకం ఇతర పేలుడు పదార్ధాలు, 9 ఎంఎం తూటాల 26, రెండు అంగుళాల మోటారు లాంఛర్లు 6, పోలీసులకు లభ్యమయ్యాయి.
News Posted: 13 March, 2010
|