అత్యాశ, స్వార్ధ చింతన
అన్ని వ్యాధుల కంటే
అతి ప్రమాదకరం
సృష్టిలో అన్నీ తనకే చెందాలంటే
స్వార్ధ చింతనతో జీవించే
మానవుల హృదయాలు దురాశాపూరితం
సర్వ జీవరాశులకు ప్రకృతి ఫలాలు
సమానంగా లభించాలన్న
ఒక్కరికొరకు అందరరం
అందరం కొరకు ఒక్కరం అనే
సృష్టి ధర్మాలను మరిచి
అధర్మంగా, అన్యాక్రాంతంగా
సర్వం చేజిక్కించుకోవాలన్నా
మానవుల దురాశ దుఖమునకు చేటు
చివరకు ప్రకృతి మాత ఆగ్రహానికి
గురి కావడం తథ్యం
|