Active Blogs | Popular Blogs | Recent Blogs శిల్పి విలాపం
నీవొక శిలవు
కాథిన్యానికి నెలవు
శలవిచ్చుటే శిలువేయుటే తెలుసు కానీ
ప్రేమేరుగని రాయివి...
నీ హృదయ మాసం లో అన్నీ అమవాసలె
కనీసం నెలవంకల చిరు దరహాసపు
పలకరింపుల వెలుతురైనా లేదు
బండను గుండెలో భద్రంగా దాచుకొని
అందమైన దయ కల దేవతా శిల్పం లా
మల్చాలనుకొనే నేనో మూర్ఖ శిల్పిని
మరి నీవో..??
అగ్ని శిఖల అణువణువునా దాచుకున్న
హిమ శైలానివి
నీ dvesHapu లావా ప్రవహిస్తోంది
హృదయం చీ........ల్చుకొని
చిద్రమైన హృదయపు తునకలు
కలుపుకొని, పేర్చుకొని
యత్నిస్తున్నా..
ఉలి స్రవించే రుధిర భాష్పాల
వీక్షించి అయినా
కరునిమ్చవా చెలీ..
ప్రతిమ కావా ??
కదలి వొచ్చు
కలికి .....
తనకు తానై బండ రాయైనా
అంకిత భావం ఉంటె....
నేను ఆశా జీవిని ప్రేమ జీవిని..
ఆమె ఒస్తుంది..
ప్రాణం పోస్తుమ్ది
నా చక్కర బొమ్మకు
నా చక్కని కొమ్మ
పలకరిస్తుంది
పరవసిమ్ప చేస్తుంది
ఆమె ఒస్తుంది..
Be first to comment on this Blog Post!
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|