Active Blogs | Popular Blogs | Recent Blogs మాట్లాడటం అనేది ఒక కళ
కొందరు మాట్లాడుతుంటే చెవిలో తేనే పోసినట్టు హాయిగా ఉంటుంది....
ఇంకొందరు మాట్లాడుతుంటే ఎప్పుడు పారిపోదాం రా బాబు అనిపిస్తుంది!
అయితే మరి ఎలా మాట్లాడితే బాగుంటుంది??
ఇదిగో ఇలా:
మంచి మాట్లాడు
అందరితో మంచిగా మాట్లాడాలి. మంచి విషయాలే మాట్లాడాలి. ఒకరి గురించి తప్పుగా మాట్లాడితే వారికి వచ్చే నష్టం ఏమి లేదు. నువ్వు మాత్రం చెడ్డ పేరు సంపాదించుకుంటావ్. నీకు అవసరమా చెప్పు?
నువ్వు సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు సినిమా చూసావా? అందులో ప్రకాష్ రాజ్ చెప్తారు కదా, " మనుషులు అందరు మంచోళ్ళే" అని... మనం కూడా అది ఫాలో అయ్యమనుకో అప్పుడు ఆటోమేటిక్ గా అందరితో మనమే మంచిగా మాట్లాడేస్తాం.
నవ్వుతూ మాట్లాడు
నవ్వుతూ మాట్లాడితే అవతలి వాళ్ళకు మనం వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత అర్ధం అవుతుంది.
అర్ధం చేసుకుని మాట్లాడు
నవ్వుతూ మాట్లాడమన్నాను కదా అని సందర్భం ఏమిటో అర్ధం చేసుకోకుండా నవ్వుతున్నావనుకో, అంత బాగోదేమో ఆలొచించు.. నీకు మతి భ్రమించిందేమో అనుకుంటారు. అందుకని సందర్భాన్ని అర్ధం చేసుకుని మాట్లాడాలి.
ఆలోచించి మాట్లాడు
ఒకసారి అన్న మాటలు మళ్లీ వెనక్కి తీసుకోలేము. అనేసిన తర్వాత, " అయ్యో, నేనలా అనాల్సింది కాదు" అని నువ్వు ఎంత తల బాదుకున్నా ఉపయోగం లేదు.
అందుకే మాట అనేముందే ఒక క్షణం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడవనుకో, తర్వాత బాధ పడక్కర్లేదు కదా....
ప్రేమతో మాట్లాడు
ప్రేమతో నువ్వు మాట్లాడే ఒక్క మాట అయినా సరే ఒక వ్యక్తికి ఆ రోజంతా సంతోషాన్ని ఇస్తుందని గుర్తుంచుకొ.
దీనికి ఉదాహరణ గా శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ సినిమా లో చిరంజీవి గారు చెప్పిన కాన్సెప్ట్ తీసుకోవచ్చు.
ఏంటంటే, రోగాలు మందులతో కంటే ప్రేమగా మనం మాట్లాడే మాటలతోనే త్వరగా తగ్గుతాయి అని..
మనసు నొప్పించకుండా మాట్లాడు
అవతలి వాళ్ళు చెప్పేది నీకు నచ్చట్లేదనుకో, లేకపోతే నీ ఉద్దేశంలో అది తప్పనుకో, దాన్ని నువ్వు వాళ్ళకి అర్ధం అయ్యేలా మెల్లగా చెప్పు. అంతే గాని నీ మాటలతో వాళ్ళ మనసు నొప్పించావనుకో , ఆ బంధం ధృడత్వం తగ్గిపోవచ్చు. ఇది చాలా ప్రమాదం కదా.. ఎందుకంటే మనకి బంధాలు చాలా విలువైనవి.
పూర్తిగా విన్న తరువాత మాట్లాడు
అవతలి వారు చెప్పేది పూర్తిగా విని మాట్లాడాలి, అప్పుడు మనం అపార్ధం చేసుకునే అవకాశాలు తగ్గుతాయి. పైగా మనం చెప్పేది ఎంత శ్రద్ధగా వింటున్నాడో / వింటుందో అని అవతలి వాళ్ళకు నీ మీద మంచి అభిప్రాయం కూడా వస్తుందన్నమాట.
మనసు విప్పి మాట్లాడు
ఎటువంటి రహస్యాలు లేకుండా మనసు విప్పి మాట్లాడితే నీ వారికి నీ పై మరింత నమ్మకం, ప్రేమ పెరుగుతాయి. బంధాలు మరింత దృడంగా మారతాయి.
ఉన్నది ఉన్నట్లు మాట్లాడు
అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని నీకు తెలిసినది కూడా చెప్పలేదనుకో, వారి అభివృద్దికి అడ్డు పడిన వాళ్ళము అవుతాము.
అలాగని నీకు తెలియని వాటిని కూడా తెలిసినట్టు భేషజాలకి పోకూడదు.
మొత్తానికి ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి.
తక్కువ మాట్లాడు
అవసరానికి మించి మాట్లాడితే నీకే ఎనర్జీ వేస్ట్, వాగుడుకాయ్ అనే బిరుదు, ఇంకా అందరికి లేని పోనీ సమస్యలు తెచ్చి పెడ్తావ్.
"తక్కువ మాట్లాడు, ఎక్కువ పని చెయ్" అనే సామెత గుర్తు తెచ్చుకొ, తక్కువ మాట్లాడు.
పైన చెప్పిన వాటిలో కొన్నైనా ఫాలో అయ్యి చూడు, తేడా నీకే తెలుస్తుంది.
సరే ఇంక, చందమామ గారు చాలా బావున్నారు, వెళ్లి పలకరించాలి. ఆ వెండి వెన్నెలని ఎంతసేపు చూసిన బోర్ కొట్టదు. సో, మళ్లీ కలుద్దాం, టాటా!!
praffulla pravallika pravallika | bagundi andi mi article. ela matladalo baga chepparu. ii mottam two sentences lo chepte bagundedi andi mottaniki vagudu kay anipinchesaru sumandi.
Posted at: 17, Dec 2013 10:23 AM |
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|