Comment and Discuss on TeluguPeople.com Articles
TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
ఓంకారమయం సైన్స్!
  Page: 1 of 4   Next > >  
Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
సిర్ది సాయిబాబ మానవుడుగా పుట్టాడు. ఈరోజు ఆయనను దేవుడుగా పూజిస్తున్నారు. సత్యసాయి బాబును కూడ దేవునిగా పూజించేవాళ్ళు ఉన్నారు. రాముడు ఒక రాజుగా పుట్టాడు. తరువాత అతనిని దేవునిగా మార్చారు. నీతి, విలువలు మహబారత, రామాయణ కతలలో తప్ప ఎక్కడ లేవని కాదు. వేమన పద్యాలలో ఉంది. సుమతి పద్యాలలో ఉంది. బతుకమ్మ పాటలు, కలుపుచేల పాటలలో కూడ ఉంది. క్రిష్టియన్స్ బైబిల్ లో చదువుకుంటారు. మహ్మదీయులు కొరాన్ లో చదువుకుంటారు. ప్రపంచంలో మంచి సాహిత్యము ఎక్కడినుంచి వచ్చిన దానిని అనువాదము చేసుకొని చదవడములో తప్పులేదు. రామాయణ, మహబారత కతలు అంతె. కాని రామాయణంలో రాక్షసులను హినముగా చూపించారు. రాక్షసులు మన పూర్వీకులు. ఈసాహిత్యన్ని చదివి మన వెళ్లతో మన కండ్లు పొడుచు కుందామా? మీలో రాక్షస రక్తము లేదా? రాక్షసులను అవమానము చేయడము మీకు అవమానము కాదా? దాని గురించి మీరు ఒక్క మాట చెప్పరేమి? PS: మాలదాసర్లు బాలనాగమ్మ కత కూడ వినసొంపుగా చెపుతారు. తెలుగు ప్రజలలొ బాలనాగమ్మ కత రామాయణ కతకు తక్కవ ఏమికాదు.

Posted by: Mr. PS Rao At: 25, Nov 2009 8:24:45 PM IST
ఇవన్నీ కట్టుకథలు అని భావించేటట్టయితే మీతో వాదన అనవసరం.ఋగ్వేదంలో ఏదో రాశారంటారు.ఋగ్వేదం లిపి లేని కారణాన రాయ బడలేదు.కంఠస్థం చేయించి తరతరాలుగా పాడుకుంటూ వుండమని చెవి మెలేసి కోదండాలు వేయించి బ్రాహ్మణ బాలురిచేత వప్ప చెప్పమనేవారు.అది అనూచానంగా వచ్చింది.లిపి వచ్చిన తరవాత దాన్ని గ్రంథస్థం చేసారు.ఈ లోపున తగుదునమ్మా అని సంస్కృతంలో వాల్మీకి రామాయణం రాసేసి అందులో ఈ రక రకాల దేవుళ్లని(మీరుద్వేషిస్తున్న వార్ని)పుట్టించేశాడు.దాన్ని బ్రాహ్మలతో సహా అన్ని వర్గాల వారూ మూఢంగా నమ్మేశారు.పల్లెలకెళ్లి చూస్తే మాలదాసర్లు కనిపిస్తారు.వాళ్లు రామాయణ-భారతాలను విన సొంపుగా చెబుతారు.నేనింక ఈ విషయాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.ఆ కథల్లో నీతులూ-నియమాలూ సమ్మోహనపరుస్తాయి గావున అందరూ పఠించారు.సీతని ఎత్తుకుపోతే బాధపడ్డట్టు చదువరులు క్లియోపాట్రాను ఎత్తుకుపోయిన కథ ఆకట్టుకోదు.ఎందుకంటే అందులో ధర్మం చెప్ప లేదు.నీతులు చెప్ప లేదు. సంస్కృతంలోని వేదాలు ఎవరికీ అర్థమై చావవు.అయితే వాటిలోని నిగూఢ భావాలని వెలికి తీసింది మిగతా కులాలే.

Posted by: Mr. vamsy vamsymohan At: 24, Nov 2009 10:54:14 PM IST
వంశీమొహన్ గారు, ఇవన్ని రిగ్వేదలో రాసారా? ఇవన్ని కట్టు కతలని మీకు తెలియదా? మీరు అన్నట్లు సత్యాన్ని తెలుసుకొండి. 'సత్యం శివం సుందరం' అంటారు. సత్యమే దేవుడు, దేవుడే సత్యం. సత్యం మానవునికి విముక్తి కలిగిస్తుంది. మీరు బ్రాహ్మలైనంత మాత్రాన మీలో రాక్షస రక్తం లేదనుకోవడం పొరపాటు. Brahmins were(are) good story tellers. I give lots of credit for that. PS: Under Nizam rule many Hindus writers wrote literature in Urdu and Parsi, and many Hindus also wrote in English. Writers want to please the Kings and the rich who support them.

Posted by: Mr. PS Rao At: 24, Nov 2009 8:09:05 PM IST
పీ.జీ లు రావటానికేముంది?అబద్ధాలు ప్రచారం చేసినా పీ.జీలు నేడు తెచ్చుకుంటున్నారు.సత్యమొక్కటే నిలబడుతుంది.సత్యాన్వేషణ చేసి సత్యం కనుక్కోండి. హోరి నాయనోయ్!ఇక నాకు చెప్పక తప్పదు.అసలు రామాయణం రాసిందెవరు?ఒక బోయవాడు.అతడు బ్రాహ్మడా?భారతం రాసినదెవరు?వేదవ్యాసుడు-పరాశరమహర్షికీ మత్స్యగంధికీ పుట్టిన వాడు.వాడు బ్రాహ్మడా?కులప్రసక్తి తెచ్చింది ఎవరు?ఒక బోయ వాడూ-ఒక జాలరి కులానికి చెందిన వాడూ.వారి మాటల మీద కొందర్ని బ్రాహ్మణులని చేసి,ముక్కు మూసుకుని మూల కూచోండి మేమే మిమ్మల్ని పోషిస్తామని తమ దాన-దయాధర్మాలమీద ఆధారపడేలా చేసి ఇప్పుడు బ్రాహ్మలే వర్ణ వివక్ష పెట్టారనటం భావ్యమా?కృష్ణుడు కులం యాదవ కులం.ఆముడు క్షత్రియకులం.పరశు రాముడు బ్రాహ్మణ-క్షత్రియ సంజాతుడు.ఈ కథలన్నీ రాసి ప్రచారం చేసిందెవరు?ఈ రూల్సూ రెగ్యులేషన్సూ పెట్టిందెవడు?మిగతా కులాల వారు కాదా?గుండు చేసుకుని పిలకతో సమాజ శ్రేయస్సుకోసం గుళ్లో కూచుని భజనలు చేయరా అంటే వారు అక్కడ కూచున్నారు.మిగతా కులాల వృత్తులవారు కాదా?జాతి సంపదను పెంచి పోషించింది?అగ్నిహోత్రం పెట్టుకుని కూచుని,అగ్నిహోత్రం ఆరిపోకుండా చూసే అధిక బాధ్యతను నెత్తికెత్తుకున్నది బ్రాహ్మలే!గదిలో పొగలో అగ్నిహోత్రం ఆరకుండా ఆజ్యంపోస్తూ కట్టెలు వేస్తూ మంట రాజేస్తూ కూచోవాలి.Great invention is Fire!Several wars took place for fire.కులాలన్నీ భ్రష్టు పట్టినట్టే నేటి బ్రాహ్మణకులం కూడా భ్రష్టుపట్టింది.వృత్తివిద్యలకు విలువ లేనందున.బ్రాహ్మడు తెల్లని వస్త్రాలే ధరించాలి.మిగతా కులాలవారి వలె రంగు బట్ట కట్టే అర్హత లేదు.వజ వజ లాడే చలిలోనైనా సరే త్రికాలాలూ చల్లని చన్నీళ్ల స్నానం చేసి సంధ్య వార్చాలి.సర్వే జనా సుఖినో భవంతు అని పలకాలి.సమాజంలోని మిగతా కులాల వృత్తులవారందరూ తమ పిల్లలని గురుకులంలో బ్రాహ్మడి దగ్గర వదిలేస్తే వారందరినీ సంస్కరించి సమాజానికి పనికి వచ్చే ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలి.ఎవరి నైపుణ్యాన్ని బట్టి వారు ఆయా వృత్తులలో కొనసాగారు.ఆయా వృత్తులలో కొన సాగినవారు తమ భృతిని తమ పిల్లలకే అంద జేయాలనే దురుద్దేశంతో తమ కులాన్ని వేరు చేసుకుని బతకడం మొదలెట్టారు.నేటి రాజకీయకులం లాగూ;సినీకులంలాగూ.తమ మతాన్ని ప్రచారం చేసుకుందుకు వచ్చిన వారు వర్ణ వివక్ష భారత దేశంలో కొనసాగుతోందని చెప్పేదాకా తెలీదా?శిక్షాస్మృతి చూస్తే బ్రాహ్మడు తప్పు చేస్తే వాడికి పెద్ద శిక్షలు వేసేవారు.పదిమందికి ధర్మం -న్యాయం చెప్పవలసిన వాడు తప్పు చేయకూడదుగదా మరి!రవాణా సౌకర్యాలు లేని ఆ కాలంలో బ్రాహ్మడు ఎద్దు మీద ప్రయాణం చెయ్యకూడదు.కాలి నడకనే మైళ్లు మైళ్లు వెళ్లేవారు.కాశి యాత్ర చేసి తీరాలి.వాడికి ముష్టి బతుకుందిగా?ప్రతి ఊళ్లోనూ ముష్టెత్తుకుని తిండితింటూ సాగి పోయే వాడు.గురుకులంలోని విద్యాభ్యాసం పొందేవారందరూ పక్క గ్రామాల్లో సంచరించి ముష్టి తింది ఎవరే గుప్పెడు పెట్టినా అదితెచ్చుకుని గురువుకూ గురుపత్నికీ పంచి అందరూ సమానంగా తినాలి.ఆ రోజులు ఎలా వుండేవో చూడనందు వల్ల ఆంగ్లేయులు చెప్పిన వేదం మీరు నమ్ముతున్నారు.ఇలా తిరిగే వారిని దొంగలు దోచుకునేవారు.అందుకోసం పరిపాలనాయంత్రాంగం పుట్టి శాసనాలు అమలు పరిచే క్షత్రియులు పుట్టారు.సరుకుల మార్పిడీ సవ్యంగా ఒకరినించి మరొకరికి మరల్చే వ్యవస్థకోసం వైశ్యులు పుట్టారు.ఆ సంపద వారి దగ్గర ఎక్కువగా పోగైతే,దాన్ని రాజులు వశం చేసుకుని అత్యవసర సమయాల్లో వాడి,తదుపరి వాణిజ్యం చేయగలందులకు వారికి అందించేవారు.ఇక వ్యవస్థ సవ్యంగా నడవగలందులకు నలుదిక్కులా కాపలాగా వున్న వారిని కాపులు-శూద్రులు అన్నారు.అసలు కులాలు నాలుగే.అయితే తమ సంతతికి తమ వృత్తులని అందించే దిశలో మిగిలిన కులాలు వటంతటావే పుట్టుకొచ్చాయి.ఎలా చూసినా వసిష్ఠుడి భార్య అరుంధతి ఆమె కులం ఏమిటి?అటువంటి శాంతియుత వాతావరణంలో ఉన్న భారత దేశంపై మహమ్మదీయులూ,పింజారీలూ విదేశీయులూ దండయాత్ర చెయ్యటంవల్ల అనేక మార్పులకు లోనై ప్రస్థుతం మనమీ స్థితిలో ఉన్నాం.తమకులము కాని మరో కులంలోని అమ్మాయిని చేసుకుంటే బ్రాహ్మలకన్నా మిగతా కులాల వారే పట్టుబట్టి ఆ ప్రెమికులపై కష సాధిచ్తున్నారు.మిగతా కులాల్లోనే ఈ వెలివేత ఎక్కువ.విష్ణువు మొదటి 3 అవతారాలు మనుష్య రూపం కావు.నరసింహ సగం మనిషి సగం జంతువు.మిగతా అవతారాలే మానవరూపాలు.ఈ అన్ని రూపాలనీ ఏ కులంలో దేవుడు పుట్టినా ఆ కులంతో నిమిత్తం లేకుండా బ్రాహ్మలే కాదు అందరూ పూజించారు.గతంలో మీరేదో మోస పోయామని మీరనుకునీ,మేమే మోసపోయామని మేమనుకునీ వ్యవహారం సాగించటం భావ్యం కాదు.దీనికి పరిష్కార మార్గం వెతికి సమస్యను పరిష్కరించుకోవాలి.మార్గం చూపేది మళ్లీ భగవద్గీతే-అదీ వేదవ్యాసుడే రాశాడు.ఒక మేకను చంపేటందుకు తోడేలు ఏటి దిగువన నీరు తాగుతున్న మేకను "నా నీళ్లు ఎంగిలి పరుస్తున్నవంటే;మేక నేను దిగువన నీరు తాగుతున్నాను,నీవు ఎగువన తాగుతున్నావు.అందుకే నీ ఎంగిలి నీరు నేను తాగుతున్నాను అందిట.అప్పుడా తోడేలు మీతాతలు మమ్మల్ని తిండానికి దొరక్కుండా పరుగులు తీసి వేధించాయి.అందుకే ఇప్పుడు నేను నిన్ను తినేస్తున్నానందిట.గతజల సేతు బంధనం మానండి.మన తాతలు ఎవరికైనా ఒక పొలం ధారాదత్తం చేసినా అమ్మినా మళ్లి మనకు రావాలంటే వారిని చంపి తీసుకోవాలనే నీతి కాక మీ బుద్ధి బలంతో ఎదిర్చి నిలబడి మంచి మార్గంలో ఉత్తమ స్థాయికి ఎదిగి (వాడే బ్రాహ్మడు) ఇదిగో ఇప్పుడు మమ్మల్ని మీరు పూజించండని నిలబడదాం.

Posted by: Mr. vamsy vamsymohan At: 24, Nov 2009 4:02:43 PM IST
ఈపిచ్చి గోల ఎందుకు, రెండవ పేజి కామెంట్స్ సెక్షన్ లో 'రిగ్వేద' లో రాక్షసలగురించి ఏమి చెప్పారో చదవండి. ఆర్యులు రాసిన పుస్తాకాలు Biased. వాటిని మీరు నమ్ముతారో ఏమో కాని బారతజాతి నమ్మే రొజులు పోయినవి. ఎంత కాలము ఈఆర్యుల కాకి గోల? వాళ్లు బారతదేశవాసులైతె, వర్ణ system ను తీసుకరావలసిన అవసరం లేకుండె. ఆర్యలు తీసుక వచ్చినవి మూడు వర్ణాలు. బ్రాహ్మన, క్షత్రియ, వైశ్య. Native బారతీయులను శూద్రలు అన్నారు. బ్రాహ్మనులన్నంత మాత్రాన బారతీయులు శూద్రులా? ఆర్యుల పుస్తకాలు సంస్కృతంలో రాసారు. ఎంత మంది బారతీయులకు సంస్కృతము వచ్చు? అనాడు కూడ బారతదేశంలో 0.005% ప్రజలకు కూడ సంస్కృతం తెలియదు. ఆలాంటప్పడు ఈపుస్తకాలు బారతదేశవాసులు రాసారు అంటె నవ్వుతారు. కండ్లు తెరచి చూడండి. మనది రాక్షస జాతి. ప్రపంచంలో ఎక్కడైన గెలిచిన వాడు, ఓడిన వాడిని హీనముగా చూస్తాడు. అలాంటిదే బారతదేశంలో జరిగింది. ఆర్యుల బాష సంస్కృతం, అది ఇండోయురొపియన్ బాష కుటుంబానిది. అర్యులు తెల్లవారు, అందుకే వాళ్ళు రాక్షస(బారతీయులను) హీనంగా చిత్రీకరంచారు. అమెరికాలో దక్షనరాష్ట్రాలలొ తెల్లవాల్లు కూడ నీగ్రోలను అదేవిదముగా గతంలొ చూసెవారు. 3500 సంవత్సరాల పోరాటము అంతముకావాలి. రాక్షస (బారత) జాతి ఆర్యుల కబందహస్తాలనుండి విముక్తి చెందాలి.

Posted by: Mr. PS Rao At: 24, Nov 2009 0:22:13 AM IST
ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు మాటాడద్దు.తెల్లవాళ్లు అంటే బ్రిటిషర్లా?లేక భారతీయులా?తెల్ల వాళ్లు రాసిన చరిత్ర అంటే ద్రావిడులూ-ఆర్యులూ అనే కట్టు కథ.ఆర్యులు ఎక్కడ్నించో రా లేదు.ఎప్పుడూ హిందూ దేశంలోనే వున్నారనేది హిందూ కథ-అదే హిందూ చరిత్ర మనం రాసుకున్న వేదాలూ చరిత్ర.అసలు 2,000సంవత్సరాలకి పూర్వం చరిత్రే లేదనే తెల్లవాడు చరిత్రని తవ్వి తీయడం తెలీక చెప్పిన మాట.అయినా శిలాజాలను బట్టి కార్బన్ డేటింగ్ ని బట్టి మానవులు ఎప్పటినించో భూమిపై ఉన్నారని చెబుతున్నారు.DNA-పరీక్షలు మన దేశంలోని దక్షిణాత్యుల జీన్స్ 80.000-60,000 పాతవి అన్నారు.ఆ బ్రిటిషర్లు రాసిన సైన్సు తమకున్న తెల్ల తోలు తో ,తమలోనున్న సంకర జాతి రక్తమే అందరిలో ఉంటుందని ప్రచారం మొదలెట్టారు.భారతీయ సంప్రదాయంలో భార్యలు మగడినించి విడి వడి మొదటి భర్త పిల్లలూ రెండూ మూడూ భర్తల్ల పిల్లలుగా లేదు.మీరు వర్ణ సంకరం తెలుపు-నలుపు చర్మాల్ని బట్టి మాటాడుతున్నారు.అలా తీసుకున్నా ఆర్యులు (మీరనుకునేవారు)నలుపు.కృష్ణుడు నలుపు.విష్ణువు-నలుపు,యముడు(దేవతే-నలుపు,శని-నలుపు,వేదవ్యాసుడు-నలుపు,కపిల వర్ణం అన్నా నలుపే.అలాగు మీరు ఎవరినైతే ద్రావిడులని భావిస్తున్నారో వారందరూ నలుపే.అందుకే హిందువులని వారు ఆఫ్రికా నించి వచ్చి స్థిర పడ్డ వారే భారతీయులనీ వీరు అనాగరీకులనీ,వీరిని బానిసలను చేసుకుని చాకిరీలు చేయించుకున్నారు.వారిని తరిమి కొట్టిన వారిలో స్వతంత్ర సంగ్రామంలో ప్రాణాలు వదిలిన వారు నలుపే-మీ జాతి పిత గాంధీ నలుపే.ఉష్ణ ప్రాంతాల్లోని జీవులు సూర్యుని వేడి వల్ల నల్లగా వుంటారు.చలి ప్రదేశాల్లో సూర్యుని వెలుతురు సోకక ఒళ్లంతా బట్టలు చుట్టబెట్టుకుని తిరిగేవారు తెల్ల బడతారు.కాశ్మీరీలూ-నేపాలీలూ-చైనా వారూ ఇలా భూమిపైనున్న వివిధ ఖండాల్లో ఉండే జాతులకూ ఆ పరిస్థితికి తగ్గట్టుగా తట్టుకునే శరీర రంగులూ,శరీర దార్ఢ్యతలూ రూపొందుతాయి.దీన్నేAdaptabilityఅంటారు.మెలానిన్ పిగ్మెంట్ మొత్తం అంత శరీరంలో ఎక్కువగా వ్యాపిస్తే శరీరం నల్లగా మారుతుంది.అదే తెల్లోడికి పుట్టుమచ్చలరూపంలో వుంటుంది.నల్ల వాడికీ పుట్టు మచ్చలుంటాయి.అయితే తెల్లవాడిలో ఈ పుట్టుమచ్చలు చాలా ఎక్కువగా వుంటాయి.అవీ మెలానిన్ పిగ్మెంట్లే. ఆంగ్లేయులు 20వ.శతాబ్దంలో అభివృద్ధికి నోచుకున్నారు.అప్పట్నించే సైన్సు చరిత్రలూ అభివృద్ధిలోనికి వచ్చినట్టు వారు రాశారు.ఆ విద్యా విధానం వల్ల మనకి అవే ప్రమాణ గ్రంధాలై,మరో త్రోవ లేక మనం బ్రిటిష్ వారి పెంపుడు చిలకల పలుకులు పలుకుతున్నాం.స్వంత బుర్రతో ఆలోచించండి.కొద్దిలో కొద్ది అదృష్టం శాస్త్ర విషయంలో రాయక తప్ప లేదు.మొదట శస్త్ర చికిత్సలు చేసిన శుశృతుడు నల్లవాడు.చెరక సంహిత రాసినదీ-ఆయుర్వేద గ్రంథాలు రాసినదీ నల్లవారే.ఖగోళ శాస్త్రంలో గతులు అన్నీ చెప్పిన వారూ భారతీయులే.వారూ నల్లనివారే.బ్రిటిషర్లూ-మహమ్మదీయులూ రాకపూర్వమేఅ ఈ గ్రంధాలు రాయ బడ్డాయి.అప్పుడు ఈ దేశంలో ఉన్న జాతి అంతా నలుపే అనుకుంటే వారు ఆర్యులే.వారు ఎక్కడ్నించో ఇండియాకు వచ్చారనేది రసినది ఆంగ్లేయులు-వారు ఆర్యులా?అనార్యులా?ఆర్య జాతి అంతా తెలుపనీ ద్రవిడ జాతంతా నలుపనీ తమకు చెప్పిందీ ఆంగ్లేయులే.మనల్ని మనం కించ పర్చుకుంటూ అంగ్లేయులన్నారని మన జాతిని వర్ణ సంకరులమని అనుకోవద్దు.

Posted by: Mr. vamsy vamsymohan At: 23, Nov 2009 4:55:21 AM IST
వంశీమోహన్, 'కుక్క తోకకు రాయి కట్టిన చక్కగ కాదు' అన్న తెలుగు సామెత ఉంది. మీమాటలు చూసిన తురువాత అది నిజమే అనిపిస్తుంది. మీరు చెప్పే కట్టు కతలు నమ్మేరోజులు పోయినవి. మానవునికి 2000 సంవత్సరాల రాసిన చరిత్రలేదు. అలాంటప్పడు మీయుగాలను నమ్మేవారు ఎవరు? అమెరికా ప్రసిడెంటు ఒబామ తల్లి తెలుపు, తండ్రి నలుపు. ఒబామను నల్లవాడు అంటారు కాని తెల్లవాడు అనరు. అలాగే హిడంబికి పుట్టిన కొడుకు రాక్షసుడే, అది తెల్లవాళ్ల చెప్పే చరిత్ర. ఉత్తర బారతదేశీయులు రాక్షస సంతతే, దక్షన బారతదేశీయులు రాక్షస సంతతే. సమస్య వచ్చింది మేము అర్యులమని చెప్పే మీలాంటి సంకర జాతివాల్లతో.

Posted by: Mr. PS Rao At: 22, Nov 2009 11:27:05 PM IST
ముఖం బాగోకపోతే అద్దం పగులకొట్టికో వలసిన వారు రాక్షసులు.మనం కాదు. లంక రావణ రాజ్యం.అక్కడుండ వలసిన రాక్షసులు భారతదేశంలోకి జొరబడి,కనిపించిన నరులను అమాంతం తినడం మొదలెడితే ఇలాటి గొడవలొచ్చాయి.సత్యం ఎప్పుడూ సత్యమే!అది మారదు.అసలు రాక్షసులను త్రేతాయుగంలో చంపిన దెవరు.భారత దేశంలో తమకు స్థానాలు కల్పించుకుని ఋషులను పీడించి చంపుతున్న వారిని రాముడు-లక్ష్మణుడు అనే ఇద్దరు సూర్య వంశ క్షత్రియులు చంపారు.ఇక లంకలో రాక్షసులను కోతిమూక చంపింది.రావణ కుంభ కర్ణులను రాముడు చంపాడు.ఇద్దరు ఆర్యులు మన రాక్షసులని చంపడం ఆశ్చర్యమే?! మన పూర్వీకులంతటి మాయావులూ,బలశాలులని కోతి మూక చంపింది.ఆర్యులు ఎక్కడ చంపారు?ఇక జరాసంధుడిని చంపిందెవరు?భీముడు.అతను ఆర్యుడా?చంద్ర వంశజుడు.బకాసురుడ్నీ భీముడే చంపాడు.వీళ్లనే రాక్షసులగా పేర్కొన్నారు.దుర్యోధనాదులను రాక్షసులనలేదే?వారూ కొందరి రాక్షసుల మాయల్లో పడి ఇబ్బందికి గురయ్యారు.హిడింబి అనే రాక్షసిని భీముడు పెళ్ళాడాడు.ఘటోత్కచుడు పుట్టాడు.వాడ్ని ఆర్య్డు అనలా మనిషి అనలా.వాడ్ని రాక్షసుడనే పేర్కొన్నారు.భీమునివల్ల పుట్టినందుకు మనిషి అనాలి.కాని రాక్షసుడు గానే చెప్పబడ్డాడు.ఇక కృతయుగంలోకెడితే-వృత్త్రసురుణ్ని సముద్రపు నురుగుతో చంపారు.ఇంద్రుడు?హిరణ్యాక్షుడిని శ్వేత వరాహం (ఆది వరాహం చంపింది)వరాహం ఆర్యుడా?హిరణ్య కశిపుని స్థంభం చీల్చుకు పుట్టిన నరసింహావతారం చంపింది.సగం మనిషి సగం సింహం. అటువంటి జంతువు ఆర్యుడా?సోమకుడు చేప చేతిలో చచ్చాడు. చేప ఆర్యుడా?ఇక సుందోపసుందులు అందమైన అమ్మాయి తనకే కావాలని తమలో తాము కొట్టుకు చచ్చారు.అంతేగాని ఆ సుందరి వారిని చంపలేదు.మన రాక్షసులు మీ లెక్కలో ద్రావిడులు వారు పూజించే ఆడ దేవతల చేతుల్లోనే చాలామంది చచ్చారు.మహిషాసురుడిని కాళిక చంపింది.రక్త బీజుడినీ ఆ ఆడ దేవతలేనేల పై నాలుక జాపి వాడి రక్తం కింద పడితే కోటానుకోట్ల రక్త బీజులు పుట్టుకొస్తారని తన నాలికతో ఆరక్తాన్ని తాగుతూ చంపింది.ఆవిడ ఆర్య దేవత కానే కాదు మీ లెక్కలో.అంటే ఆ రాక్షసులకి అమ్మ వారికి తమ రాక్షసులనే బలి యిచ్చే ఆచారముంది.అటువంటి ఆచారాన్ని ఆర్యులు ఆపడం ఆ తల్లి బతిమాలి-ప్రసన్నం చేసుకుని ఎలాగో మన ద్రావిడులనీ చంపకుండా చేసినందుకు గర్వించాలి.మీరు బ్రిటిష్ వాళ్లు చెప్పింది వేదమనీ వారు మనల్ని సంస్కరించారనీ అన్నందుకే ఈ వాక్యం.ప్రపంచం మొత్తంలో చేతి వృత్తుల్లో మన వారికున్న నైపుణ్యం ఏ దేశస్థులకీ లేదు.ఆంగ్లేయులొచ్చి మన మధ్యన వైరుధ్యాలు కల్పించారు.అందరూ సఖ్యంగా వున్న వారి మధ్య కుల వైషమ్యాలను తెచ్చారు.వారి మాటే నిజమనుకుని తమను స్థాయి తగ్గించి చూస్తున్నారనే భావన కలిగిం చారు.అలాగే భారత దేశాన్ని విడ దీసి పాకిస్తాన్-ఇండియా అన్నారు.ప్రతీ పండక్కీ పబ్బానికీ చావు పుటకలకీ హైందవ మత ఆచారం ప్రకారం అన్ని కుల వృత్తుల వారూ అవసరమౌతారు.దేవుని పూజల్లో కూడా ఇది ఉంది.మన దేశంలోకి విదేశీయులు వచ్చి,మన ఆచార వ్యవహారాల్లో కలుగ చేసుకుని మనల్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి మన వేలితో మన కన్నునే పొడిచారు.గ్రహించగలరు.ఏ మనిషికైనా కావలసింది కూడూ-గుడ్డా-గూడూ.ఈ మూడూ అందరికీ ఉండే విధంగా అన్ని జాతుల వారికీ వారి వారి కోటాల ధాన్యము పంచి మిగిలినదే ఉమ్మడిగానో దైవ కార్యాలకో వడే వారు.ఈ విషయం సీరియస్ గా కూర్చుని ఆలోచిస్తే గాని తెలీదు.బైబిలు చేతిలో పెట్టి మాలో కులాలులేవనే వారు-క్యాథలిక్కులూ-ప్రొటెస్టంట్లూ-ఇంకా ఎన్నో జాతులగా మారి కొట్లాడుకుంటున్నారు.ముస్లిములైతే షియా-సున్నీలుగానూ ఇంకా మరో జాతులుగానూ కొట్లాడుకుంటున్నారు.వారు(అలా కాట్లాడుకునేవారి) మాటలు మనం పట్టించుకుని మన సఖ్యతను వదులుకుని గొడవపడ్డం ధర్మం కాదు.ఉత్తర హిందుస్థాన్ వారిని ఆర్యులనుకునీ మనము ద్రావిడులమనుకుని మనలని మనం కించ పరుచుకో రాదు.హిందూ ఋషులు పెండ్లాడినది విజాతి(మీరు చెప్పే కులం)వారినే!?

Posted by: Mr. vamsy vamsymohan At: 22, Nov 2009 4:29:25 PM IST
తెలుగులొ ఒక సామెత ఉంది. 'మొకము బాగా లేక అద్దము పగులకొట్టాడట'. సత్యాన్ని ఎవరు చెప్పిన సత్యము సత్యమే. మన మొకం బాగాలేక తెల్లవాళ్లును దూషించడము ఎందుకు? మన సమాజాన్ని ఒక్క సారి కండ్లు తెరిచి చూడండి. ఆర్యలు చూపించిన రేసిజం (racism) ప్రతి దగ్గర ఇప్పడు కూడ కనిపిస్తుంది. వాళ్ల ప్రవర్తన రిగ్వేద కాలమునాటి నుండి ఇప్పటికి మారలేదు. సత్యాన్ని కొరకు పాటుపడండి. ఆర్యుల(ముక్యంగా బ్రాహ్మనుల) చెప్పే కట్టు కతలు మానండి. వాటిని నమ్మేవాళ్ళు పలచనైపోతున్నారు. రాక్షసజాతి నుంచి బారతజాతి పుట్టింది అని ఒక్కసారి తెలుసుకొండి. మనవాళ్లను మనము గౌరవించుకోవడములో తప్పులేదు. బారతదేశంలో పుట్టిన మహ్మదీయులు రాక్షస సంతతియే, బారతదేశములో పుట్టిన బ్రాహ్మనులు రాక్షస సంతతియే అని గ్రహించండి!

Posted by: Mr. PS Rao At: 22, Nov 2009 8:10:10 AM IST
ఏ ఆంగ్లేయుడో మరొకరో రాసిన హిస్టరీ చదివి మనం అవే పలుకులు పలుకుతున్నాం.కృతయుగంలో ఋషులు ఆర్యులా?ద్రావిడులా?శైవా రాథన ద్రావిడులదైనప్పుడు,ఆర్యులూ ఎందుకు శైవా రాథనలు చేశారు.శివ భక్తులైన ద్రవిడులను చంపటానికా?రాక్షసులు అంత చాతకాని చవటలా(మన ద్రవిడుల పూర్వులు) ఇప్పుడు మనం శాస్త్ర పరంగా డైనోసిరాస్ లు వున్నాయంటే నమ్ముతున్నాం కదా.నాడు రాక్షసులు బలవంతులని చెప్పుటకు ఎన్నో ఉదాహరణలున్నాయి.అంతటి బలవంతులు ఆర్యుల చేతిలో ఓడిపోయారంటే ఊహించ గలరు.రావణాసురుడు వేద వేదాంగాలు చదివాడు.రావణుడు నేల కూలగానే,అతని వద్ద శాస్త్రాలు తెలుసుకోమని భరతుడిని పంపి తెలుసుకున్నాడు.పర దారని తెచ్చిన రావణుడు మనకాద్ర్శమా?ఆ పని మన తాత చేసినా తానక ఊరుకుంటామా?మండోదరి రావణుడు చేసిన పని తప్పంది.విభీషణుడు తప్పన్నాడు.ముక్కు మూసుకుని మూల కూచున్న ఋషులని జపములు చేసుకోవద్దని బాదడం మంచిదా?మాటాడితే ఆర్యులు అలా రాసుకున్నారు అంటారు-అది ఆర్యులే రాసుంటే మంచిదే.నీతులు చెప్పారు.ప్రహ్లాదుడు రాక్షసుడే తండ్రి మాట జవదాటి నారాయణ అన్నాడు.ద్రావిడులు మీరనుకునే రాక్షసులు విజాతి మాంసం అదే ఆర్యులది తినేవారు యుద్ధం చేసి.అది నరమాంస భక్షణలోకి రాదా?మనము రాక్షస సంతతి (ద్రావిడుల మనుకుంటే)మన పూర్వీకులే తమకు తాముగా చనిపోయే ముందు వైరిని (విష్ణువు)పొగిడి ధర్మం నీ పక్షాన్నుంది అని పలికి చనిపోవదం విడ్డూరమే?అంచేత ఈ కథలు ఆర్యులు రాశారు.పర పీడన-ఇతరుల విషయంలో జోక్యం చేసుకోని మనుష్యులను చితక బాదడం జన్మ హక్కా?ఆలొచించి చూడండి.కనీసపు మానవతా విలువలకై హక్కుల పోరాటం లాటిది భగత్ సింగ్ ది.ఇది కాక ముట్టడి దోపిడీ అన్నవి ఉన్నాయి వాటికీ భారత దేశం బలైంది.హిందూ దేశాన్ని ముట్టడించిన వాళ్లని మీరు రాక్షసులనక పోవచ్చు.తమ భూ భాగంలో తాముండ కుండా ఇతరుల భూభాగంలో చొర బడి వాళ్ల ఆస్తుల్నీ-ధన మానాలనీ దోచుకునే వారిని ఏమనాలి.భారత దేశం ఆర్య్లదనుకుంటే వీరు ఇతర దేశాల మీద దండెత్తిన దాఖలాలు మీకేమైనా చరిత్రలో ఉంటే చెప్పండి.

Posted by: Mr. vamsy vamsymohan At: 21, Nov 2009 7:03:03 PM IST
  Page: 1 of 4   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.