TeluguPeople
  are the trend-setters

 
Articles: Short Stories
పొయెట్రీ ఆఫ్ లైఫ్
  Page: 1 of 1    
Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
'సోమూ నువ్వు నీ శరీరాన్నీ మనసును రిలాక్స్ డు గా వుంచుకో.నీ మనస్సులో ఇప్పుడు ఏ అలోచనలూ లేవు.అంతా ఫ్రీ!ఈజీ!!హేపీ!! ఇప్పుడు నీకు కొద్దిగా మత్తుగా వుంది కదూ!అవును.అలాగే వుంటుంది.నీకు నిద్ర రాబోతోంది.అదిగో నీ కళ్లు మూతలు పడుతున్నాయి.నీవు నిద్రలోకి జారుకుంటున్నావు.నీవు నిద్రపోతున్నావు.నీకీ నిద్ర చాలా తృప్తిగా వుంది.నువ్వు చాలా చాలా హేపీగా వున్నావు.' 'సోమూ!' 'ఊఁ!' 'బాగుందా?' 'చాలా బాగుంది డాక్టరు గారూ!' 'ఇప్పుడు నేను చెప్పే మాటలను సాంతం శాంతంగా విను.నీ చెల్లి ఆడదై పుట్టినందుకు ఎంతో సుఖ పడుతోదనుకుంటున్నావు కదూ!నిజానికి నీ చెల్లి స్య్ఖ పడుతోందో కష్ట పడుతోందో తెలుసుకోవాలంటే-నీ చెల్లి మాటల్లోనే ఆమె ఏం చెబుతోందో విను.' 'అన్నయ్యా!ఈ దేశంలో ఆడదై పుట్టే కన్నా అడవిలో మానై పుడితే మేలురా!ఊరికే అన లేదు.'ఆడదాని జీవితం అరటాకు వంటిదని.అరిటాకు వెళ్లి ముల్లు మీద పడ్డా,ముల్లొచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకుకే నష్?టం.నా స్నేహితురాలు మీనాక్షిని నువ్వెరుగుదువు కదా!పాపం పెళ్లై ఆర్నెల్లు తిరక్కుండానే స్టౌ పేలి వళ్లు కాలి చనిపోయింది.అదేం కర్మమో ఈ దేశంలో కోడళ్లు వెలిగించే స్టౌలే పేలి పోతుంటాయి.అత్త గార్లెవరూ అలా స్టౌలు పేలి చావరు.నిజానికి జరిగిందేమిటో తెలుసా?తెచ్చిన కట్న కానుకలు చాల్లేదని మీనాక్షిని అత్తగారి తరఫు వారు నిలువునా చంపేశార్రా!అన్నయ్యా! ఒక ఆడ దాని నిండు బతుకుని నాశనం చేసి మళ్లీ పెళ్లి చేసుకుని మరో అమ్మయిని చంపడానికి సిస్షంగా వున్నార్రా వాళ్లు.అంతే కాదురా అన్నయ్యా ,నీకు తెలుసుగా 'సర్వమంగళ?' దాని బతుకేమైంది?పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేయాలనే ఆశతో ప్రెమించిన వాడితో లేచి పోయింది. కాని ఆ త్రాష్టుడు దాన్ని తీసికెళ్లి వ్యభిచార గృహంలో అమ్మేస్తే దాని జీవితం కుక్కలు చింపిన విస్తరైంది.ఎలాగో ఆ నరక కూపంలోంచి బయట పడి పోలీసు రిపోర్టైతే ఇవ్వ గలిగింది కానీ ఆ తరవాత తన బతుకు ఎందుకూ పనికి రాదనే బాధతో విషం మింగి ఆత్మ హత్య చేసుకుంది.ఇక 'సుశీల ' ఆస్తి పాస్తులు లేకున్నా అందముంది.గుణ సంపదుంది.కాని,ఏం లాభం?పెళ్లిళ్ల మార్కెట్ లో 'మొగుడ్ని ' కొనుక్కో లేక కన్యగానే మిగిలి పోయింది.ంకనింటెదర 'రధ 'గూద్చి నీకు తెలీదా?ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటాననై మోసం చేస్తే ;కడుపులో పెరుగుతున్న పాప ఫలాన్ని తన జీవిత శాప ఫలంగా భావించి ఎవరికీ చెప్పుకో లేక మౌనంగా రోదించి సీలింగ్ ఫానుకు ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. 'అన్నయ్యా! ఈ దేశంలో అరక్షణానికో రేప్ కేసు నమోదౌతోందిరా.క్షణానికో స్రీ వర కట్న సమస్యకు బలైపోతోందిరా!పురుషుల అంతు లేని కామ దాహానికీ-ధన దాహానికీ ఎందరు అబలలు అర్థాంతరంగా అగ్నిగుండంలో శలభాలై మాడి పోతున్నారో ఒక్క సారి ఆలోచించరా.మిమ్మల్ని గన్న తల్లి ఆడది.మీకు తోడ బుట్టినది చెల్లో-అక్కో.వాళ్లు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో అలాగే పరాయి కొంపనించి మీ దగ్గరకొచ్చి,మీకు తోడు నీడగా నిలచి మీకు జీవితాన్నీ ప్రేమనూ పంచి ఇచ్చే అమృత మూర్తి లాంటి ఆడదాన్ని మీరు మీ పురుషాహంకారంతో ఎంత నీచంగా చూస్తున్నారో ,'ఒక్కసారి ఆలో చించరా!అపుడు నీకే అర్థమౌతుందిరా ' ఆడది ఈ లోకంలో అనుభవిస్తున్న ఆనంద మేమిటోను!?' 'ఒరే అన్నయ్యా!నేను బోలెడు కట్నం తీసికెళ్లాను. మంచి ఉద్యోగం చేస్తున్నాను.అందుకే నేనత్తారింట్లో సుఖ పడి పోతున్నాననుకుంటున్నావు కదురా!పిచ్చి అన్నయ్యా! అసలీ లోకంలో ఆడది కష్ట పడ్డానికే పుడుతుందిరా.ఆడది తన కష్తాల్ని పైకి చెప్పుకోదు.మౌనంగా రోదిస్తుంది.తన బాధలను తనలోనే దాచుకుంటుంది.తన బాధలను పెదవి విప్పి పైకి చెప్పుకుంటే తన భర్త నలుగురిలోనూ చులకనై పోతాడు.ఇంటి గుట్టు లంకకు చేటన్నట్టుగా తన పరువు పోవడమే కాకుండా నలుగురిలోనూ నవ్వులపాలౌతానేమో ననే భయంతో ఆడది అంతరాంతరాల్లోనే కుమిలిపోయి అనారోగ్యం పాలై భర్తకన్నా ముందుగా వార్థక్యాన్ని తెచ్చుకుంటుంది.నీకు తెలుసునా అన్నయ్యా!'నేనెన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపానో?ఎన్ని రాత్రులు నాలో నేనే మౌనంగా రోదించానో?'నేను పడుకునే నా మంచానికీ నా తలగడకీ నేను కార్చిన కన్నీళ్లతో అవి తడిసినందువల్ల వాటికి బాగా తెలుసు.నేననుభవిస్తున్నది ఆనందమో చిత్ర వధోను.మొదటి కాంపులో నాకు ఎబార్షన్ అయిన విషయం నీకు తెలుసున్నదేగా?అదెలా జరిగిందనుకుంటున్నావ్? -స్కానింగ్ జరిపించి,నా కడుపులో పెరుగుతున్నది ఆడ పిండ మని తెలిసి,నా ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా నాకీ పశువులు ఎబార్షన్ చేయించార్రా! ఆ రోజు నేనెంత వెక్కి వెక్కి ఏడ్చానో నీకు తెలీదు..ఆడదాన్నై వుండీ మరో ఆడ పిల్లకి జన్మ నివ్వలేని పాతకినీ-హంతకురాల్నీ నేన్రా!' ' ఈ ఇంట్లో నేనందరికీ ఓ పరిచారికన్రా అన్నయ్యా!ఇంట్లో వాళ్లందరి కళ్లూ నా మీదే నిఘా!ఇక సూటీ పోటీ మాటలంటావా?వాటికి అంతూ పొంతూ వుండదు.నేనుద్యోగం చేస్తున్నానని నాకు గర్వంట!దానికి తోదు మీ బావ గారికి నా మీద అనుమానం.ఆయన లెక్కల్లో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఆడదీ చెడిపోయినట్లే.అలాగని మళ్లీ నేనుద్యోగం మానేస్తానంటే ఒప్పుకోరు.నేను తెచ్చే జీతం కావాలి గాని నేనక్కర్లేదు.ఇంత చేస్తున్నా ఈ ఇంట్లో వాళ్లకి నా మీద కనీస జాలీ కరుణా వుండవు.ఉద్యోగం చేసి అలసి పోయి ఇంటికి వచ్చినా అన్నీ నేనే చూచుకోవాలి.ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు పాల పాకెట్లు తెచ్చి కాఫీ కలిపి అందరికి ఇచ్చకే నేను తాగాలి.ఈ ఇంట్లో వారెవరూ కూడా ఇవతల చెంబు తీసి అవతల పెట్టరు.ఎంతాలస్యంగా వచ్చినా అంట్లు నేనే తోమాలి.ఆ తరవాత వంట చేసి నలుగురికీ పెట్టి ఏమైనా మిగిలితేనే నేను తినాలి.సాధారణంగా మిగలదు.ఎందుకంటే అన్ని కొలత ప్రకారం వండాలి.బడ్జెట్టుని ఏ పరిస్థితిలోనూ మించకూడదు.ఇంకా సూర్యోదయం కాకుండా లేవాలి.అందరికీ అన్నీ అమర్చాలి.ఇందులో ఏ మాత్రం తేడా రాకూడదు.ఇన్నీ చేశాకే నేను ఆఫీసుకు ఆదరా బాదరాగా పరిగెత్తాలి.కనీసం ఏ ఆదివారమో సెలవు దినమో వస్తే,నేను సుఖ పడటం వాళ్లకిష్ట ముండదు.ఆ రోజే ఇల్లు దులపడాలూ-బట్టలుతకడాలూ పెడతారు.అవేవీ లేకుంటే తీరి కూర్చుని ఇంటిల్లపాదీ తలంట్లు పెట్టుకుంటారు. నెల పూర్తవగానే పైసా తగ్గకుండా కడిగిన ముత్యాల్లా నేను జీతం మొత్తం తెచ్చి వాళ్ల చేతుల్లో పోయాలి.నా డబ్బుతోనే తాము తిండి తింటున్నామనే ఇంగితజ్ఞానం లేకుండా నన్ను సరిగ్గా తిండి తిన నివ్వరు.ఆకలికి తటు కోలేక ఆఫీసు క్యాంటీన్ లో కొనుక్కుని ఏవో కటింగ్స్ అనీ,చందాలిచ్చాననీ అబద్ధాలాడే దాన్నిరా.మనింట్లో నేనెప్పుడైనా అబద్ధమాడి ఎరుగుదున్రా?ఇంత వరకూ ఆడుతున్న అబద్ధాలు ఇక ముందు ఆడ లేనురా.ఎందుకో తెలుసా?వాళ్లకి నేను ఆఫీసు క్యాంటీనులో తింటున్నానని తెలిసి పోయింది.ఇక నేను అర్థాకలితో బతకాల్సిందే.' 'ఇక పదిరోజులకోసారి నా ఆడ పడుచు పుట్టింటికొచ్చి నా మీద అధికారం చెలాయిస్తుంది.నా చీరెల్లో మంచివాటి నన్నిటినీ ఎంచి పట్టుకు పోతుంది.అందుకేరా నేను మాటి మాటికీ అమ్మనీ-నాన్ననీ చీరెలు కొనమని వేధించేది.మరో ముఖ్య విషయమ్రా అన్నయ్యా!చెప్పకూడనిదే అయినా నీ పరిస్థితి చూసి చెప్పక తప్పడం లేదు.తల్లి తండ్రుల ఆజ్ఞలు శిరసా వహించడంలో తప్పించి,మీరందరూ మీరందరూ అనుకుంటున్నట్టుగా మీ బావ గారేం శ్రీరామచంద్రుడు కాడు.దొరకాలేగాని ఎటువంటి ఆడ దానితోనైనా సంబంధం పెట్టుకోవడానికి సిద్ధమే.ఒక రోజున పనిమనిషితో ఆయన సాగిస్తున్న సరసాలు చూచినందుగ్గాను నాకు దెబ్బలు పడ్డాయి.ఇంట్లో ఏ ఒక్కరూ ఆయన్ని కేక లెయ్య లేదు సరికదా నన్నే తిట్టారు.'ఆయనకేం ఆయన మగ మహారాజు 'అని ఆయనకు వత్తాసు పలికారు.ఇలాటివి చూసీ చూడనట్లు పోవాలని అత్తగారు నాకు హితోపదేశం చేశారు.మగాడు తాగినా వ్యభిచరించినా తప్పులేదట!?మా మామ గారన్నారు.ఈ నరక కూపంలో నేనెలా బతుకు వెళ్ల మారుస్తున్నానో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోరా అన్నయ్యా!ఒరే అన్నయ్యా!ఈ విషయాలేమీ అమ్మకీ నాన్నకీ చెప్పకురా!అనవసరంగా వాళ్లని క్షోభ పెట్టడం ఇష్టం లేక ఎలాగో జీవితంతో రాజీ పడి సర్దుకు పోతున్నాన్రా.నువ్వేదో ఆడది సుఖ పడిపోతోందనుకుంటున్నావు కాబట్టి నీకీ విషయాలు చెప్పాను.లేకుంటే నీకూ చెప్పేదాన్ని కాదు.నా బాధలూ-నా మనసులోని ఈక్షొభా ఒకే ఒక్క సారి నేను శ్వాసవిడిచాక ఆ కట్టెల్లో కాలి పోవాలి.అలాగే మధ్య తరగతి కుటుంబంలోని ప్రతి ఒక్క సగటు ఆడదీ కోరుకుంటుంది. Add this missing link to understand full version of story.By mistake it was not posted.By this Somu understood that his birth as son is better than his sister.

Posted by: Miss vijayalakshmi vijayalakshmi At: 12, Dec 2009 8:18:49 PM IST
bAguMdaMDI mI poyeTrI Af laif . chAlA nATakIyaMgA kUDA uMdi.

Posted by: Bullibasu Bullibasu At: 20, Nov 2009 8:40:42 PM IST
  Page: 1 of 1    
 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
Regional News
Anantapur
Eluru
Guntur
Hyderabad
Kadapa
Kakinada
Karimnagar
Kurnool
 
Nellore
Ongole
Nizamabad
Rajahmundry
Tirupati
Visakhapatnam
Vijayawada
Warangal
Photos
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Articles
All Articles
Poetry
Short Stories
Blogs
My Blogs
Popular
Active Blogs
Recently Created
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals
Networking
My Friends
New Members
Invite a Friend
 
Discussion
Poetry
Govt and Politics
Offbeat and Jokes
Videos
Top in Views
Top by Rank

(C) 2000-2018 TeluguPeople.com, All Rights Reserved.