|
|
Articles: Short Stories | నాన్నకు రాయని ఉత్తరం - Editor
| |
(పింగళి బాలాదేవి)
మహారాజశ్రీ నాన్నగారికి బాల నమస్కారములతో...
నాన్నా మీకీ ఉత్తరం రాద్దామని ఎప్పట్నించో ప్రయత్నం చేశాను. ఇన్నాళ్ళూ నువ్వు రాయలేదా అని మీరు అనవచ్చు. మామూలుగా రాసే ఉత్తరాలు మీకు తెలిసినవే కదూ - ఒక మూసలో పోసినట్లు - మేమంతా క్షేమం, మీరంతా క్షేమమని తలుస్తాను.మీ ఒంట్లో, అమ్మ ఒంట్లో బావుందని తలుస్తాను. మీరెప్పుడు వస్తారు? తమ్ముళ్ళు, మరదళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉత్తరాలు రాస్తున్నారని తలుస్తాను. మాకు సెలవులు దొరికినప్పుడు మేము వస్తాము.... వగైరా... వైగైరా. మీరు ఇన్నాళ్ళు ఎదురు చూసింది ఇటువంటి ఉత్తరం కోసం కాదని నాకు తెలుసు. అందుకే ఇది ఎన్నేళ్ళనుంచో మనసులో మెదులుతున్న భావనల మధనానికి ఒక రూపంగా రాద్దామనుకుంటూనే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. నేను రాయలేదని మీ మనసుకి కష్టంగా అనిపించి ఉండవచ్చును కదూ.
ఇంకా ఉత్తరం మొదలు పెట్టానో లేదా టెలిఫోన్ - టింగ్... మని లాంగు రింగుతో మోగుతోంది.. అంటే ఎవరిదో ఎస్.టి.డి అన్నమాట. అమ్మాయిల కోసమో, శ్రీవారి కోసమో ఏ అమెరికానుండో, మలేషియా నుండో ఫోన్ వచ్చి ఉంటుంది.
ఈ టెలిఫోన్లు వచ్చి దూరదూరాలకి ఎంతో తొందరగా సెకండ్లలో దగ్గరగా ఉంటున్నట్లుగా మాట్లాడుకోగలుగుతున్నాం అందరమూ - సముద్రాలు, కొండలు, కోనలూ, వాగులూ, నదులూ, అడవులూ, ఎడారులూ దాటి మరీ.
టెలిఫోను అంటే నాకు క్రిందటి సంవత్సరం మీరు రాసిన ఉత్తరంలో టెలిఫోన్ల గురించి రాసింది మెరుపులాగ గుర్తుకు వచ్చింది. ఏం రాసారో మీకు గుర్తుందా నాన్నా? ఈ ఫోన్సులో సంభాషణ తృప్తిగా ఉండదు. ఆ టైముకు డబ్బు ఎక్కువ అయిపోతుంది అన్న గాభరా తప్ప ఏం మాట్లాడాలో తోచదు. అందుకే ఎస్.టి.డి.చేసే ముందు కాగితం, మీద ఒకటి, రెండు, మూడు అని పాయింట్స్ రాసుకుని అవి చెప్పాక ఫోను ఉంచేస్తున్నానని.
అలాగే నాకయితే అసలు ఏం మాట్లాడాలో తోచదు. మాట్లాడవలసింది వెంటనే జ్ఞాపకం రాదు. ఏదో మాట్లాడి పెట్టేయడమూ, తర్వాత అయ్యో ఇది చెప్పడం మరచిపోయానే, అది అడగడం మర్చిపోయానే అనుకోవడం. ఏది ఏమయినా ఈ టెలిఫోన్ల వల్లనే నేను అనుకున్న ఉత్తరం రాయలేకపోయానేమో అని ఒకోసారి నాకు అనిపిస్తుంది. అసలు మీ ఉత్తరం చదివినప్పటినుండి మరీ కోరికగా ఉండేదీ మీకీ ఉత్తరం రాయాలని. అది ఇవాళ ఈ అర్థరాత్రి కుదిరింది.
మనసులో ఏదో వెలితి. చెప్పలేని ఒంటరితనం. భారంగా, నిస్పృహగా ఉంది. ఏవేవో జ్ఞాపకాలు, స్మృతులు. చిన్నప్పటి నుండి నా జీవితం ఒక సినిమా రీలులా నా కళ్ళముందు తిరిగిపోయింది. మీ ఉత్తరంలోని కొన్ని భాగాలు మనసుని మరీ కలవరపర్చేట్లు ఉన్నాయి.
| Read 6 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|