|
|
Articles: My Thoughts | దొర లు మారాలి - Editor
| |
(బుచ్చి రెడ్డి)
ఇది దొరల రాజ్యం
ఇది దొంగల రాజ్యం
స్వరాజ్యం వచ్చిందీ
దొరలకు-- దోపీడీదారులకు
ఖూనీకోరులకు--చెంచాలకు,
దొరలకు--కావలసిందీ--పెత్తనం
ఆధిపత్యం--- రాజరికం
వీళ్ళు గోడ మీది పిల్లులు
నక్కజిత్తుల తెలంగాణా కాంగ్రెస్ నేతలు
జెండా రంగులు మార్చడంలో
మిల్కాసింగ్ కన్నా మిన్నగా
పరుగులు చేయగలరు
పదవులు చేపట్టాగలరు.
వీళ్ళకు వోట్ వేయించుకోవడం
వాళ్ళే వేసుకోవడం-- తెలుసు
వోట్--కొనగలరు
ఈ రోజు
అన్ని పార్టీలలో
అస్సెంబ్లీ-- లోక్ సభ-- రాజ్యసభ
టిక్కెట్లు పార్సెలు.
దొరలు కొనగలరు
రేపు రెట్టింపుగా సంపాదించగలరు.
యా బై ఏండ్ల చరిత్రలో
రాష్ర్టాన్ని ఎక్కువ కాలం
రాజ్యమేలిందీ--- దొరలు
దోచుకుందీ--- దొరలు
ముంచిందీ--- దొరలు
బోలో స్వంతత్ర భారత్ కి జై
వీళ్ళ గారరడీ మాటలకు
నిఘంటువులో
కొత్త అర్థాలు వెతుక్కోవాలి.
వీళ్ళు శివారెడ్డి మిమిక్రీలా
గొంతులు మార్చగలరు
కొత్త పాటలు పాడగలరు
చరిత్ర పేజీలు తిప్పండి
అః రోజు--
నిజాం నవాబ్ తో చేయి కలిపిందీ --- వీళ్లే
ఈ రోజు
వ్యక్తి పూజలతో
సోనియా--బాబు---చిరులకు
చెంచాగిరి చేస్తున్నది -- వీళ్ళే
ఏ ఎండకు-- ఆ గొడుగు
బ్రతకనేర్చిన వాళ్ళు
బ్రతుకులను కూల్చేవాళ్ళు.
ఇల్లు కాలుతుంటే బొగ్గులేరుకునే వాళ్ళు.
సంస్కృతం మాత్రమే చదివే వేద పండితులకూ
దళిత కవిత్వం బోధపడదన్నట్లు
ఈ దోపిడీ ఖద్దరులకు
పేగుల సరిగమలు
ఆకలి చావులు
దగా పడ్డ తెలంగాణా-----అర్థం కావు
జీవితాలను--- ప్రాంతాన్ని
ఫాయిధా లేని సత్తుబిళ్ళగా
చెత్తకాగితంలా--చేసిందీ-
ఈ ఖద్దరలు షా లు కారా???
ఎంతకాలం-- ఈ గింజులాటలు---గుంజాటనలు
ఎంతకాలం--- ఈ జోలపాటలు-- లాలిపాటలు
ఎంతకాలం---చిలుక జోస్యాలు--- చిలుక పలుకులు
ఎంతకాలం---ఈ రంపపు కోతలు
మారూతూ ఉన్నకాలం
ఎందిరా ?? బాంచెను--కాల్లు మొక్తా
చెప్పులు చేతబట్టి-- వంగిన నడుముతో
తాకితే-- ముట్టు అయితామన్న
ఆ రోజులు
హక్కుల ఉద్యమాలతో
ఆత్మగౌరవ పోరాటాలతో
మంటగలిసి పోయినాయి
పాత్రలు-- వేషాలు
మారిపొయినవి--- ఫైల్ క్లోస్డ్
కాలంపై సమరం ప్రకటిస్తూ
తిరుగుబాటు మొదలైందీ
అవమానం--- అవహేళన
తట్టుకొలేక
ఆగ్రహం-- ఆక్రోశం-- తపన
బద్ధలు అయి చిమ్మిన లావా
దళిత ఉద్యమం
దారి చూపే దిక్సూచి
ఇక వచ్చేది దళిత శకమె?
ఒక వై పూ--
గౌడ్ నాయకత్వంతో
జై తెలంగాణా నినాదంతో
నవ తెలంగాణా పార్టీ ఊరేగింపు---
మరో వై పూ--
చంద్రశేఖర్ కన్నా నాయకత్వంలో
ప్రజా తెలంగాణా పాతతో
ఊరేగింపు---
రెండు గుంపులు ఒకటై
కొత్త ఉద్యమ--మొదలు ఆవబోతున్నది
సిలబస్ మారుతుందీ
దొరలు-- పాత మార్చండి
గొంతులు కలపండి
మన అందరిది
ఒకే మాట
ఒకే పాత
ఒకే మాట
జై తెలంగాణా -- కావాలి
దొరలు మారాలి-- తెలంగాణా రావాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|