|
|
Articles: TP Features | స్విస్ ఖాతాల గుట్టు రట్టు - Mr. Narsing rao D
| |
గుప్తనిధుల అడ్డాగా పేరుపడిన స్విస్ బ్యాంక్ తన విశిష్టతలను క్రమంగా కోల్పోతోంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో రహస్య నిధుల వివరాలను బహిరంగ పరచాలని యుబిఎస్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్)పై ఫెడరల్ అథారటీ ఒత్తిడి పెంచింది. యుబిఎస్ లో దాచుకున్న సంపన్న అమెరికా ఖాతాదారుల రహస్య అకౌంట్ల వివరాలను బహిర్గతం చేసేందుకు ఆ బ్యాంక్ సిద్ధపడింది. స్విస్ బ్యాంక్ చరిత్రలో ఎన్నడూ ఊహించని పరిణామం ఇప్పుడు మొదలయ్యింది. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కు వివరాలు అందించకుండా యుబిఎస్ రహస్యంగా ఉంచిన 19 వేల అకౌంట్లు ఇప్పుడు బహిర్గతం కానున్నాయి. ఆ కోణంలో యుబిఎస్ పలు చర్యలు చేపట్టింది.
అకౌంట్లను రహస్యంగా నిర్వహించే ఖాతాదారుల ఆస్తులను ఇతర బ్యాంకులకు గాని, ఇతర యుబిఎస్ శాఖలకు గాని బదలీ చేసేందుకు ఆ బ్యాంక్ నిర్ణయించుకుంది. లేకపోతే, సంబంధిత ఖాతాదారులకు వారి చెక్ లను యుబిఎస్ నేరుగా మెయిల్ చేయనుంది. పన్నుల ఎగవేతకు మార్గంగా యుబిఎస్ బ్యాంకును ఎంచుకుని డబ్బు దాచుకున్న వైనాన్ని ఫెడరల్ రిజర్వ్ పరిశీలించి వారిపై సంబంధిత కేసులను నమోదు చేసే అవకాశముంది. యుబిఎస్ నిర్ణయం దాని రహస్య ఖాతాదారులకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంలా మారింది.
ఖాతాదారులకు యుబిఎస్ పంపే చెక్ లను వారు క్యాష్ గా మార్చుకోవచ్చు. అలా చేస్తే చట్ట విరుద్ధంగా వారు దాచుకున్నవిషయం ఆర్ధిక నేరంగా సంబంధిత అధికారుల దృష్టిలో పడే అవకాశముంది. అలాంటి పరిస్థితి దృష్ట్యా యుబిఎస్ చెక్ ను సొమ్ము చేసుకోకపోతే రహస్య నిధులు దక్కకుండా పోతాయి. లేకపోతే వారు ఆ డబ్బును వేరే బ్యాంకుల్లోకి బదలాయించుకునే అవకాశముంది. వేరే బ్యాంకుకు ఈ డబ్బును బదలాయించవచ్చు. అయితే 10 వేల డాలర్లకు మించిన డబ్బును బదలాయిస్తున్నపుడు ట్రెజరీ డిపార్ట్ మెంట్ కు తప్పనిసరిగా తెలియజేయ వలసి ఉంటుంది. అలా ఆర్ధిక నేరం బయటపడే అవకాశముంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|