|
|
Articles: TP Features | మన భాష...భవిష్యత్తు - Dr. Ramesh Babu Samala
| |
'క్లాసికల్' భాషాప్రతిపత్తి వ్యవహారం మనకు ఒక విధంగా మేలే చేసింది. మనను మనం మరచి గాఢ నిద్రలో మునిగివున్న స్థితిలో ఒక్కసారి వీపున చరిచినట్లయింది. మన విశిష్టత గురించి గాక మన ప్రాచీనత గురించి వెతుకులాటలో పడిపోయాం. ప్రాచీన సాహిత్యం గురించి చెప్పవలసి వచ్చేసరికి అప్పటిదాకా పట్టించుకోని మౌఖిక వాఙ్మయం, దేశీయతలూ కావలసి వచ్చాయి. సంగ సాహిత్యం వాళ్లు చెప్పుకొనేంత ప్రాచీనం కాదనీ, అందులోకి వెళ్తే అక్కడా తెలుగువారూ వారి బ్రతుకులూ దర్శనమిస్తాయని తేలింది. చరిత్రలోతుల్లోకి వెళ్లే కొద్దీ ఎటు చూచినా తెలుగువారి పూర్వీకులే కన్పిస్తున్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో ఎంత చీలిపోయిందీ, ఎలా విస్తరించిందీ తెలిసింది.
సింధూ నాగరికతలోకి వెళ్లినా, సుమేరియన్ సంగతుల్లోకి వెళ్లినా తెలుగువారి పూర్వీకులే కన్పిస్తున్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో ఎంత చీలిపోయిందీ, ఎలా విస్తరించిందీ తెలిసింది. సింధూ నాగరకతలోకి వెళ్లినా, సుమేరియన్ సంగతుల్లోకి వెళ్లినా తెలుగువాడితనమే దర్శనమిచ్చింది. భారతదేశంలో మానవుడి వికాసక్రమంలో ఆంధ్రుణ్ణి తప్పించి చూడడం వీలు కాదు సరికదా, తెలుగువాడి ప్రతిభనూ, ప్రాభవాన్నీ తగ్గించి చూపడం కూడా సాధ్యం కానిదని తేలిపోయింది. సురవరం, కొమర్రాజు వంటి మన చరిత్రకారుల నుండి ఇటీవలి తమిళ పరిశోధకుడు సుబ్రమణ్య మలయాండి వరకు - అందరూ తెలుగువారి ప్రాచీనతను, గొప్పదనాన్ని తేల్చి చెప్పినవారే. ఇంత శోధనలోనూ తేలిందేమిటంటే - తెలుగు మూలాలవారు - ఎంతో కొంత తెలుగును మాట్లాడగలిగినవారు ఎక్కడెక్కడున్నదీ చూసుకొంటే - కనీసం అటు మహారాష్ట్ర, ఇటు ఒరిస్సా వరకు గీతగీసి ఆ దిగువకు మూడు సముద్రాల హద్దుల్లోపలి భూభాగాన్ని వెతికితే - సుమారుగా తయారుకాగల భాషా సాంస్కృతిక చిత్రపటం ఇలా ఉంటుందని తెలిసింది. రాష్ట్రాల హద్దుల్ని గుర్తుపెట్టకుండా, జిల్లాలను పరిగణనలోకి తీసుకొని ఆ పటాన్ని తయారు చేస్తే అది ఆ విధంగా వచ్చింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|