|
|
Articles: Poetry | వీర వందనం - Site Administrator
| |
(కలువకుంట నారాయణపిళ్లై)
మా గొప్పలకు గొప్ప
ఓ గుర్రప్ప చౌదరీ!
సుమధుర భావాల రసఝరీ
మాకు పంచావు స్వచ్ఛమైన
స్నేహమాధురి
బంగరు బాల్యాన్ని బహూకరించిన
నీ పుట్టిన పల్లె
కర్మవీరుడౌ
నిన్ను కన్నతల్లిదండ్రుల జన్మ
పోరాటపటిమ నీకు గరపిన
పోతు తెలుగు హోసూరు గడ్డ
అహో! బహుధన్యం సదా మాన్యం.
నెలనెలా మొదటి ఆదివారం
కృష్ణగిరి జిల్లా రచయితల సంఘంలో
నిండువెన్నెలలా నువ్వు
ఆంధ్ర సమితి కార్యక్రమాలలో
తేట తెలుగు ప్రతిమలా నువ్వు
తెలుగు హిందీ భాషార్ణవాల
రంగుల సంగమంగా నువ్వు
మా అభిమానం కొల్లగొట్టిన నువ్వు
బహుభాషా పరీమళాల
విప్పారిన పువ్వు
మా మనో నేత్రాలకు
నిత్యం హుషారుగా స్ఫురించే
నీ యౌవనమూర్తి
రాష్ట్రావధుల్ని దాటిన నీ ఘనకీర్తి
కాగలదు మాకు నిండైన స్ఫూర్తి
బ్రతుకు కలలు దండిగా
పండించిన సైరికా!
అలసిసొలసి పుడమితల్లి ఒడిలో
విశ్రమించిన భాషాసైనికా!
నీకు మా వీరవందనం!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|