|
|
Articles: Poetry | తెలిమంచు కిరణం - Site Administrator
| |
(డా.శిలాలోలిత)
స్వరఝరిలో తళుక్కున మెరిసే నీటిబొట్టు తెలుగు
అమృతధారలో నిలిచే తేనెబొట్టు తెలుగు
భారతీయ భాషలన్నింటా నిలిచే వెలుగు
జిలుగు మాటల తియ్యందనాల హరివిల్లు
కవుల కంఠాకాశాన కురిసే వానజల్లు
లోహపు నగరాన తెలిమంచు కిరణం తెలుగు
జన జీవన చైతన్యపు దృశ్యమానం తెలుగు
ప్రాచీన హోదాను నూత్నాలంకరణ చేసుకున్న వెలుగు తెలుగు
మన తెలుగు
మదిన వెలుగు
అజంత హలంత భాషల జాలువారిన సోయగం
సంగీత మాధుర్యాలను సంతరించుకున్న వైభవం
తెలుగు వారి నోట
ప్రతి ఇంటి ముంగిటా
ప్రతి మనిషి పంటివిరుపులో
మెరిసే విద్యుత్కాంత తెలుగు
తెగువతో ముందడుగు వేసి
కొత్త హోదా నెత్తుటితో
విజయకేతనం ఎగరేస్తోంది
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|