|
|
Articles: Poetry | నిన్ను గెలవనివ్వను - Mr. tharun marella
| |
రౌడీలో గూండాలో
వెలుతురు సరిపడని వాళ్ళో
అడుక్కు తినే బానిసలో
పని దొంగలో
అవినీతిపరులో
కుంభకోణాల కోటీశ్వరులో
పాఠాలు చెప్పని పంతుళ్ళో...
ఇంకా సిగ్గు లేకపోతే
నీకు ఓటేస్తారేమో గాని
వ్యక్తిత్వం ఉన్నవాణ్ణి
సొంత బుర్ర గలవాణ్ణీ
బాధ్యతలు నిర్వర్తించేవాణ్ణి
అవినీతిని ఎదిరించేవాణ్ణి
ఒరే దొంగ నాయకా,
కొత్త వేషంలో వస్తున్నావా,
నా తెలివి పెరిగిన ఓటు
నీ అక్రమాలకు సూటి పోటు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|