చల్లని గాలుల సాయంత్రాలు
వెచ్చని వెలుగుల శుభోదయాలు
రొమాన్స్ నిండిన వెన్నెల వెలుగులు
మనకి దూరమవుతున్నాయా
మనం దూరమవుతున్నామా
కరెన్సీ కోసం
అలసట లేని మహాప్రయాణం
నీ వాళ్లకి
నీలో వాళ్ళకి
దూరంగా... ఒంటరిగా
ఎంతకాలం.. ఈ పరుగు
ఎంతో ఎత్తుకు ఎదిగాక
వెనక్కి చూస్తే... మొత్తంగా
నువ్వొక్కడివే...
డబ్బు నిండుగా ఉన్నా... ఎడారిలో
దేని కోసమో ఎదుచూస్తూ...