|
|
Articles: Poetry | పరవశం - Mr. Vamsi Krishna K
| |
నీ జలతారు వన్నెలే...
నా పాలిట వెన్నెల చినుకులు...!!
నీ సోకు సోకితే చాలు...
వెనువెంటనే నా మనసుకి వేల మూర్ఛలు...!!
పూతలేసిన...లేత మామిడి కొమ్మలా...
పట్టు పరికిణీలో పల్లెపిల్లా...
వలపు చిగురు వగరులద్దే...
వగలే నీకు నగలా...!!
నీ నవ్వులు...దోసిలి పట్టి...
స్వాతి వానలో కడగనివ్వు....!!
సొగసులు...మువ్వ కట్టి...
నీ దారుల్లో సిరిమల్లెలు...చల్లనివ్వు...!!
నీ జారుపైటల మత్తుగాలి...
మెత్తగా నను తాకనివ్వు...!!
మునిమాపు వేళ... ముసిరే నీ చూపులే..
నాకు... ముద్దుల ముక్తావళి...!!
ఈ మమతల మైథునంలో...
అనుక్షణం...మనకు దీపావళి...!!
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|