|
|
Articles: Poetry | తేడా.. - pAnIpUrI
| |
అతను అన్నీ చదివాడు
ఇతను ఏమీ చదవ లేదు
అతను ప్రతి పూటా కూడు కోసం..
ఇతను ఈ పూట జీవనం కోసం
అతను వృత్తిలో ఓనమాలు నేర్చుకుంటున్నాడు
ఇతను వృత్తిలో ఆరితేరాడు
అతను ప్రతి పూటా బతుకు దెరువు కోసం
ఇతను తరువాత తరాలవారి సోమరితనం కోసం
అతని నట్టింట్లో దరిద్రం తాండవిస్తుంది
ఇతని నట్టింట్లో సిరి అలరారుతుంది
అతను ఈ పూట పరువు కోసం
ఇతను రేపటి పదవి కోసం
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|