|
|
Articles: Poetry | క్షణం - Mrs. sujatha Thimmana
| |
నీకై నిలిచిన క్షణము
ఇది ఎన్నడు వాడదు నిజము
కలలో వెలిసి
ఇలలో నిలిచిన క్షణము
ఆకుల దొన్నెలలో చేరిన
హిమవన్నగమే
కరిగి బిందువై
జారిన క్షణము
నీకై నిలిచిన క్షణము
అరవిరిసిన పూవున
వాలిన తుమ్మెద
మకరందము గ్రోలిన క్షణము
నీకై నిలిచిన క్షణము
ఎండా వానా కలయికలో
వెలుగూ చీకటి ఏకాంతంలో
ఏడు రంగుల హరివిల్లయి
నింగీ నేలను కలిపిన క్షణము
నీకై నిలిచిన క్షణము...
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|