|
|
Articles: Poetry | నానీలు - 37 - Miss kumari kumari
| |
నీకోసం వ్రాసుకున్నవి
చెరిపి చూడు..
జీవిత పుటలన్నీ
ఖాళీయే..
జీవితంలో
కలలు - కష్టాలు - కన్నీళ్ళా!
బాధపడకు..
ధైర్యే సాహసే లక్ష్మి..
తీగకు - పందిళ్ళెన్నో
పందిరికి - తీగలెన్నో
తోట కాదు..
విడాకుల కంప..
'పెళ్ళి ' అనేది
ఒక పదం కాదు..
అర్థం కాలేని
అర్థవంతమైన ఓ వాక్యం..
ఇంట్లో ఏకాంతంకై
క్రొత్త జంట పడే
తహతహల హాయి..
లేదు హనీమూన్ లో!
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|