|
|
Articles: Poetry | భాష బలిని ఆపాలి - Site Administrator
| |
(పి.ఎస్.నాగరాజు)
ఎంతో కమ్మని మన తెలుగు
ఎంతో సంపద మన తెలుగు
పలికినకొద్దీ పలుకుబడి
వాడుక బట్టీ పదునెక్కు ||ఎంతో||
మేలు భావనల పదసిరుల
వేల ఏళ్ళ సెల మన తెలుగు
తిక్కన-వేమన-గురజాడ
మేలి మలుపుల ప్రవహించు ||ఎంతో||
అమ్మభాషలో సహజత్వం
సొంతభాషలో సృజనత్వం
పరాయిభాషకు రాదండీ
పరాయితనమును వీడండి ||ఎంతో||
తల్లిభాష బలి ఆపండి
మాతృభాషలో ఎదగండి
చదువూ, పాలన ప్రజలభాషలో
నడిచినప్పుడే ప్రజాస్వామ్యము ||ఎంతో||
మాతృభాషనే ప్రేమించు
పరభాషలను గౌరవించు
ప్రపంచ వ్యాపిత విజ్ఞానాన్ని
అమ్మభాషలో పొందుపరుచుకో! ||ఎంతో||
| Read 7 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|