ఈ చల్లని వేళలో
ఈ వెన్నెల హాయిలో
నా కోసమె విరిసెనూ
ఈ తెల్లని మల్లియ
తెలి మబ్బుల తేలి
ఓ మబ్బు తునక
హేమబిందువై
వర్షించెను
మనసు పరవశాన
మైమరిచెను
ఈ చల్లని వేళలో...
ఏ పూలని దోచెనో
ఓ గాలి తెమ్మెర
మకరందాల
సుగంధాలతో
నను చుట్టేసెను
గిలిగింతల అల్లరిగా
ఈ చల్లని వేళలో...