|
|
Articles: Poetry | మన్నించుమా.. - Mrs. sujatha Thimmana
| |
మన్నించుమా ఒక్కసారి
ప్రియతమా...మన్నించుమా
నిండు జాబిలి
పండు వెన్నెలలు
కురిపించు ఈ రేయిలో
మరుమల్లెలు పూచిన
ఈ వేళలో...
చిరుగాలుల లాలనలోనా..
మైమరిచా ఒక్క క్షణం
నీ ఆగమనమునే
గమనించనైతినే..
ఈ ఒక్కసారికీ
మన్నించుమా..ప్రియతమా
అలుక తీరా..
అడుగు మరీ..
ఆకలేసిన వలపులకు
విందుచేస్తా..
దాచుకున్న తెరతీసి
దాగని అందాలతో..
మరి...ఈ ఒక్కసారీ
మన్నించుమా...ప్రియతమా
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|