|
|
Articles: TP Features | మూడో ఫ్రంట్ తో ముప్పు - Site Administrator
| |
(ఎస్సెస్వీ)
ఎన్నికల్లో తుదిఘట్టం పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాల కోసం అందరూ ఆతృతగా, ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ (పార్టీయా కాదు, కాదు ఏక పార్టీ పాలన ఏనాడో అంతరించిపోయింది) ఏ కూటమి అధికారంలోకి వస్తుందా అంటూ అందరూ ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. ముంబాయి మహానగరంలో అయితే దీనిపైన ఏకంగా కోట్ల రూపాయల్లో బెట్టింగులు కూడా జోరుగా సాగుతున్నాయి. 'ఏకూటమి గెలిచినా జనానికి ఒరగబెట్టేది ఏమీ ఉండదు, తమ తమ జేబులు నింపుకోవడం తప్ప' అంటూ కొందరు నిరాశావాదులు పెదవి విరుస్తున్నప్పటికీ మెజారిటీ వర్గాల్లో మాత్రం ఉత్కంఠ నెలకొన్నదనే చెప్పవచ్చు. ఇక రాజకీయ నాయకుల గుండెల్లో అయితే ఏకంగా రైళ్లే పరుగెడుతున్నాయంటే అతిశయోక్తి కాదేమో.
రాజకీయ నాయకుల సంగతి అలా ఉంటే షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లు సైతం ఎన్నికల ఫలితాల కోసం ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు. ఏ కూటమి అధికారంలోకి వస్తే మార్కెట్ ఎటు జారుతుందో అని కొందరు ఆచితూచి అడుగేస్తున్నారు. అందుకే ఎనిమిది వారాలుగా ఉవ్వెత్తున ఎగసిపడిన సెన్సెక్స్ గత వారం కాస్త మందగించి మైనస్ పాయింట్లను నమోదు చేసింది. ఈ నేపధ్యంలో ఏ కూటమి గెలుస్తుందన్న అంశం జోలికి పోకుండా ఏ కూటమి గెలిస్తే మార్కెట్ ఎటు పోతుందన్నది ఈ విశ్లేషణ ఉద్దేశం.
గత రెండు మూడు దశాబ్దాలుగా దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏర్పడిన చీలికలు, అధికారం కోసం నాయకులు ఆతృతతో చూస్తుండడం వంటి కారణాల దృష్ట్యా దేశంలో లెక్కకు మించిన రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చాయి. ఇంకా పుట్టుకొస్తున్నాయి కూడా. ఫలితంగా సొంత మెజారిటీతో, ప్రభుత్వం ఏర్పాటుచేసే సత్తా ఏ ఒక్క పార్టీకీ లేకుండా పోయింది. దాంతో కూటములు, సమీకరణాలు మొదలయ్యాయి. 1975 ప్రాంతంలో జనతాపార్టీ పేరుతో ప్రారంభమైన ఈ సమీకరణలు రానురాను మరింత బలపడి చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం కోసం చిన్నా చితకా పార్టీలను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో 1999, 2004 ఎన్నికల్లో బిజెపి దాని మిత్రులతో కలిసి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో కూటమి ఏర్పాటు చేయగా కాంగ్రెస్ తనకు అనుకూలంగా ఉన్న పక్షాలతో కలిసి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ను ఏర్పాటు చేసింది. 1999 ఎన్నికల్లో నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి అయిన యునైటెడ్ ఫ్రంట్ అధికారాన్ని చేపట్టింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|