|
|
Articles: Poetry | మినీకవితలు-4 - Dr. rangarao raavi
| |
వి'ఫల' ప్రేమ
---------
ప్రపంచం
మోహించిన
డాలరును
తిరస్కరిస్తోంది
మామిడి పండు!
ఎండాకాలం
-------
బతుకులో
చల్లదనమే కాదు-
ఎండలూ కావాలి
విజయాల మల్లెపూల
పరిమళాల కోసం!
పెద్ద మనుషులు
---------
మతాలు వదిలేశాం,
కులాలు వదిలేశాం,
అప్పుడేం చేశారో తెలుసా-
మా పుట్టుమచ్చల్ని
వెతకటం మొదలెట్టారు!
దు:ఖం
----
రెండు
అక్షరాల
ఆంక్షల మధ్య
ఇద్దరు ప్రేమికులు
బందీలు!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|