|
|
Articles: Poetry | ఉన్మాదం ఉగ్రవాదం - Venkateswara Rao Madu
| |
(కామేశ్వరీ సాంబమూర్తి భమిడిపాటి)
ఉన్మాదం ఉన్మాదం
ఉగ్రవాదం ఉగ్రవాదం
అమాయక జీవుల
ఉసురు తీసే ఉన్మాదం
అనుక్షణం భీతావహం
అణువణువూ మృత్యు హేల
అడుగడుగునా మృత్యు మృదంగం
అరచేత ప్రాణాలు
కనుమరుగైన కారుణ్యాలు.
ఇంటా బయటా ఎటు చూసినా
ఏ క్షణం ఏమి జరుగునో
ఏ ఉప్పెన ఎదురై
ఆపద ముంచునో
ఎరుక లేని ఆక్రోశం || ఉన్మాదం||
రైలు రైల్వే స్టేషన్
బస్ బస్ స్టాండ్ విమానయానమ్ ఏర్ పోర్ట్
హోటల్స్, మార్కెట్లు,
దేవాలయాలు, మసీదులు, చర్చిలు
ఎచ్చోట ఏమి జరుగునో
ఏ రూపాన మృత్యువు కబళించునో
కనలేము వినలేము
దుష్ట ముష్కర మూకల
దమన కాండలు ||ఉన్మాదం||
మెషీన్ గన్స్, టైమ్ బాంబులు
సూసైడ్ బాంబర్లు కార్ బాంబులు
వేర్వేరు మరణాయుధాల మారణహోమాలు
మరుక్షణం జరుగనున్నది ఎరుకలేని
అమానుష చర్యలు,
అమాయక ప్రజల ఆహుతులు
ఆత్మీయుల ఆవేదనా ఆక్రోశాలు
మానవ సృష్టిత ప్రకంపనాల పుడమంత
తల్లడిల్లే ఇసుమన్త శాంతి లేని
భయానకం భారతావని సంక్షోభం ||ఉన్మాదం||
అధికార హోదాలు ప్రజా ధన
ఆరగింపులకే గాని దురాగతాలనణఛలేని
దుష్ట కిరాతకుల దునుమాడ లేని భీరుత్వ పెద్దరికాలు
నిస్వార్ధ సేవకుల, నైతిక విలువల పాటించు నిఖార్సయిన
ఉద్యోగులపై నిందలు మోపీ విధినిర్వహణ కట్టడి చేసి
నిజాయితీపరుల వేధించి మారణకాండలకు
ఆజ్యం పోసే
గద్దెలెక్కిన పెద్దలెందరో
ఎవరో వస్తారు ఏదో చేస్తారని
ఆశగా చూసే ఎదురుచూపులే
నేటి పుడమితల్లి
ప్రారబ్ధం దౌర్భాగ్యం ||ఉన్మాదం||
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|