|
|
Articles: Poetry | జీవితం - Miss kumari kumari
| |
గుప్పెడు మనసు
మోయలేని ఆశలు
బరువైన బాధ్యతలు
ఇదేనా జీవితం!
సడిలేని మనసు సవ్వడులు
ఆశల ఊసుల ఊహలు
బాధ్యతలను బరువుగా మార్చిన వేళ
జీవితమే ఓ సమరం..
మెత్తని హౄదయాన్ని మత్తుగా ఉంచక
మరులుగొల్పే మురిపాలతో పొద్దు పోనీయక
సాగనీ నీ జీవనయానం..
మంచికి మరో పేరుగా
మనిషికి మరో తోడుగా
మనసుకు మరో మనసుగా
మనుగడకు భాష్యం నేర్పే భావనగా
మలచుకో నీ జీవన గమ్యం..
కనపడునపుడు
జన్మను సార్ధకతను చేసుకునే ఆశల హరివిల్లు..
కురియునపుడు
బాధ్యతల్లో బాంధవ్యాల మధురిమ..
ఇదే జీవిత సత్యం
ఇదే జీవన పరమార్ధం
(On 2-10-2006, this Kavitha won a prize
in Poetry Competition on ‘JIVITHAM (LIFE)’
conducted by OPEN HOUSE,
Life Health Reinforcement Group,
Kothapet, Hyderabad)
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|