|
|
Articles: Poetry | అమ్మ వంటిది కాదు - Site Administrator
| |
(బుచ్చిరెడ్డి)
స్వాతంత్ర్యం -- సమానత్వం
నీతి -- న్యాయం
సమత -- మమత
సేవ -- మార్పు
అన్నీ
దమాక్ లేని గ్రీన్ రూమ్ పిచ్చిమాటలు
గమకాలు తప్పిన పాటలు
ఈ రోజు
దళారీ -- దోపిడీ నేతలు
వేసే ప్రతి అడుగు -- మాట రాజకీయం
కులాల ఎ బి సి డి ఎస్ గ్రూప్ లతో
మతం ఒక ఆయుధంలా వాడుకుంటూ
దొంగలు రాజ్యం ఏలుతుంటే
ఈ ముళ్ళబాటలు తప్పవు
ఎన్ని మలుపులు తిరిగినా
బ్రతుకు బద్ నసీబీ -- భారం అయిపోతుంది
నేటి నేతల్లో
సభ్యత -- సంస్కారం
గౌరవం -- నిలకడా -- నిజాయితీ
హుందాతనం -- అన్నీ లోపించి
మాయం అయి
కుటుంబ -- కుల గ్లామర్ రాజకీయాలు
చలామణి అవుతున్నపుడు
ఇది మన వ్యవస్థ
ఈ వ్యవస్థ నమ్మకానికి అమ్మ వంటిధి కాదు
చీకటి తలుపులు తెరవాలి
తిరగబడటం జరగాలి..
ఎంతకాలం
మన కళ్ళకు
కాళ్లకు
చేతులకు
మనసులకు
అవేదనలకు
ఆవేశాలకు -- సంకెళ్ళు
ఎంతకాలం ??
ఎంతకాలం -- దొంగదారులు -- దొడ్డిదారులు
ఎంతకాలం -- తేనె మాటలు -- మాయమాటలు
ఎంతకాలం -- దండిగా మాటలు -- దాపుడు మాటలు
ఇంకా ఎంతకాలం -- చతికిలబడ్డ వాళ్ళతో మోసం -- దగా ??
ఇక చాలు
ఆక్రి దఫా --లడాయ్ కి రెడీ
తుది హెచ్చరిక
ఇసాబ్ కావాలి
మన ఎజండాలో మార్పు రావాలి
ఐక్యత -- ఉద్యమం -- పోరాటం
పదండి ముందుకు
కుల రహిత -- సర్వ జనహిత
సర్వోన్నత -- సర్వోత్తమ
తెలంగాణా తెచ్చుకుందాం
పదండి -- కదలండి
జై తెలంగాణా!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|