|
|
Articles: Poetry | హిమ బిందువు - Mrs. sujatha Thimmana
| |
హిమ బిందువు
గడ్డిపోచకు
ప్రాణమయినది
భానుని లేత కిరణాల
వేడికి కరిగి
ఆవిరయినది
స్వాతిచినుకై
ముత్యపుచిప్పలో చేరి
తన అస్థిత్వాన్ని కోల్పోయి
చిరస్థాయిగా నిలిచిపోయే
వన్నె తరగని
ముత్యమయినది
బిందువు సాటి చేయదు
మనిషి జీవితం
నా కోసం ఎవరు
ఏమి చేస్తున్నారు అనే
స్వార్థమే తప్ప
తన వలన ఒక్కరికయినా
మేలు జరుగుతుందా
అనే ఆలోచన లేని
కల్మష పూరిత
కలశం ఈ మనిషి జీవితం
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|