|
|
Articles: Poetry | అక్షరం - Site Administrator
| |
(శైలజా మిత్ర)
ప్రేమ రెండక్షరాలే.. కానీ..
అవి రాస్తాయి జీవితమనే గ్రంథాన్ని
పెళ్ళి రెండక్షరాలే.. కానీ
అవి నిర్ణయిస్తాయి ఆయుఃప్రమాణాన్ని
మనిషి మూడక్షరాలే.. కానీ
అవి చూపుతాయి మారణహోమాన్ని
మనసు మూడక్షరాలే.. కానీ
అవి తెలుపుతాయి మమతల సుగంధాల్ని
మానవత్వం నాలుగక్షరాలే.. కానీ
అవి వెతుకుతాయి తన స్థానాన్ని
దానవత్వం నాలుగక్షరాలే.. కానీ
అవి ఆక్రమించుకున్నాయి ప్రపంచాన్ని
అక్షరానికి ఆది గురువు అమ్మయితే
అదే అక్షరానికి మలుపు అనురాగం
అక్షరానికి ఆలంబన భాషయితే
అదే అక్షరానికి పిలుపు భావం
పక్షులకు అక్షరాలు తెలియకున్నా
జంతువులకు పదబంధం లేకున్నా
వాటిని గమనించే మన కళ్ళలో అక్షరాలున్నాయి
వాటిని తెలుసుకునే మన హృదయంలో అక్షర లక్షలున్నాయి
అందుకే...
మనం అక్షరాన్ని అలంకరిద్దా
తెలుగుదనాన్ని కోయిల గానంతో స్వాగతించి
తెలుగుతల్లిని పూజించుకుందాం..
తెలుగుభాషను పెంపు చేసుకుందాం...!!
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|